चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 38, कुल 674 में से
संदर्भ में पढ़ें17 ఆంధ్ర తాత్పర్యసహితము.
పిత్తజ్వరమును పోఁగొట్టును. పర్పాటకము, ఉసిరిక వీటితో చేయఁబడిన క్వాథము నుగాని; ద్రాక్ష, తిప్పతీగె, రేలచెక్క వీటితో చేయఁబడిన కషాయముగాని పిత్తజ్వర మును పూర్ణముగా నశింపఁజేయును. ద్రాక్ష, కరక్కాయ, పర్పాటకము, తుంగముస్త లు, కటుకరోహిణి, రేలచెక్క వీటితో సమభాగముగ సిద్ధము చేయఁబడిన క్వాథ మును, ప్రలాపము, మూర్ఛపోవుట, భ్రాంతికమ్ముట, అతిదాహము, సొమ్మసిల్లుట, దప్పి, అరకయుండుట ఈమొదలగు గుణము లుండెడి, పిత్తజన్యమైన జ్వరము వచ్చినరోగికి యిచ్చినయెడల నెమ్మది కలుగును.
[పిత్తజ్వరము గలవానికి శీతక్రియలు; ధాన్యాకశృతము; అభ్యంజ నము; శిరోలేపనము; ఉద్వర్తనాదులు; కాంజిక వస్త్రధారణము; మాతులుంగబంధనము.]
శ్లో. ప్యుషితం $^1$ధాన్యకజలం ప్రాతః పీతం సశర్కరం పుంసామ్,
అంతర్దాహం శమయత్యచిరాద్దూరప్రరూఢమపి. 91.
పిత్తజ్వరేణ తప్తస్య క్రియాం శీతాం సమాచరేత్,
విదారీదాడిమం లోధ్రం $^2$దధిత్యం బీజపూరకమ్. 92.
ఏభిః ప్రదిహ్యాన్నూరానం తృడ్దాహార్తస్య దేహినః,
ఘృతభృష్టామॢపిష్టాచ ధాత్రీలేపాచ్చ దాహనుత్. 93.
ఆమ్లపిష్టైస్సుశీతైర్వా పలాశతరుణై $^3$ర్దిహేత్,
బదరీపల్లవోత్థేన ఫేనేనారిష్టకస్య $^4$చ. 94.
కాలేయ చందనానూతా యష్టీబదర కాంజికైః,
సఘృతై స్స్యార్ఛిరోలేప స్తృష్ణాదాహర్తిశాంతయే. 95.
ఉత్తానసుప్తస్య గభీరతామ్ర కాంస్యాదిపాత్రం ప్రణిధాయ నాభౌ,
తత్రాంబుధారా బహుళా పతంతీ నిహంతి దాహం త్వరితం సుశీతా. 96.
శీతకాంజిక వస్త్రావగుంఠనం దాహనాశనమ్,
జిహ్వాతాలుగలక్లోమ శోషే మూర్ధ్నితు దాపయేత్. 97.
కేసరం మాతులుంగస్య మధు సైంధవసంయుతమ్.
పిత్తజ్వరమునకు చేయవలసిన శైత్యోపచారములను చెప్పుచున్నాఁడు — ధనియాలను నీటిలో రాత్రియంతయును నానవైచి, ఆనీటిని చక్కెర గలిపికొని త్రాగినయెడల నొగులకు కలిగిన భయంకరమగు సంతర్దాహము ముదిరినదైనను శీఘ్రముగా నశిం
1 ధాన్యకజలం. 2 కపిత్థం. 3 ర్దిహేత్. 4 వా.
3