मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 141, कुल 167 में से
संदर्भ में पढ़ें134 ముకుందమాల నీకు, తనూజః = కుమారుడు, వేదః = ఋగ్యజుస్సామా థర్వణ వేదములు, స్తోతా = ' స్తుతిపాఠకుడు (బట్టువాడు), సురగణః = దేవతాసమూహము, భృత్యవర్గః = పరిచారకులగుంపు, ముక్తిః = మోక్షము, ప్రసాదః = నీ యను గ్రహము, అవికలం = సమస్తమైన, జగత్ = ప్రపంచము, తావకీ = నీయొక్క, మాయా = ప్రకృతి, దేవకీ = దేవకీదేవి, తే = నీయొక్క, మాతా = తల్లి, బలరిపు సుతః = అర్జునుడు, తే = నీయొక్క, మిత్రం = స్నేహితుడు, అతః, అన్యత్ = ఇంత కంటె నితరమును, త్వయి = నీయందున, న జానే = ఎఱుంగను. నీకు భార్య క్షీరసాగరపుత్రియగు లక్ష్మీదేవి. కుమారుడు బ్రహ్మ. స్తోత్రము చేయునది వేదము. దేవతలు పరిచారకులు. మోక్షము నీ యనుగ్రహము. సమస్తజగత్తు నీ మాయారూపముగల ప్రకృతి. తల్లి దేవకీదేవి. హితుడు అర్జునుడు. నీయందు ఈ చెప్పిన దానికంటె వేరొకటి నే నెఱుగను. స్వామి : మిగుల స్తోత్రము చేయుచున్నావు. నా సంగతుల నెవరు చెప్పిరి? నన్ను గూర్చి యేమి వింటివి? ఏమి తెలిసి కొంటివి? కులశేఖరులు : స్వామీ! క్షీరసాగరమున నుద్భవించిన లక్ష్మీదేవి నీ భార్య యని తెలిసికొంటిని. ఎవరిమీద లక్ష్మియొక్క కడగంటి చూపుపడునో వారు బ్రహ్మేంద్రు లగుదురని ఉపనిషద్వాక్యము. అట్టి లక్ష్మీదేవి తోడ స్వామి సృష్టి చేయును. లక్ష్మీనారాయణులు ప్రపంచమును సృష్టిచే యువిధమును ఒక కవి చదరంగ మాడుటగ వర్ణించెను. ప్రపంచమే చదరంగ మాడు పలక. సత్యలోకమాదిగా గల లోకములు గళ్లు. బ్రహ్మాది సకలప్రాణులును కాయలు. సత్త్వగుణము తెల్లరంగు, రజోగుణ మెఱ్ఱరంగు. తమోగుణము నల్లరంగు. సాక్షులు వేదములు.