चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
ఆంధ్ర తాత్పర్యసహితము. 3
యును. అన్నమును తినవలయు ననుకోరికఁ గలిగించును. రుచి కలిగించును. శరీరమునందలి భారమును తగ్గించి చులకఁదనమును కలిగించును.
జ్వరముగలవారికి లంఘనము చాలమంచిది కదా యని యెక్కువగా లంఘనములను చేయింపరాదు. ప్రాణములకు ముప్పు లేని లంఘనమునే రోగికి పెట్టించుచుండవలయును. ఏలయనఁగా—లంఘనముంచుట, ఆరోగ్యముకొఱకేగదా! ఆయారోగ్యము బలమునుబట్టి యుండును. ఈచికిత్సలన్నియు నేందుకొఱకో అట్టి యారోగ్యమునకు భంగమురానీయక రోగిని లంఘనములఁ జేయింపవలయును.
-- లంఘనార్హత, తత్పక్వాపక్వలక్షణం; లంఘనాధిక్యముగల్గినవానిలక్షణము. --
శ్లో. తత్ర మారుతతృట్తృష్ణాముఖశోషభ్రమాన్వితే. 8.
కార్శ్యం నబాలే వృద్ధేవా నగర్భిణ్యాం నదుర్బలే,
వాతమూత్రపురీషాణాం విసర్గే గాత్రలాఘవే. 9.
హృదయోద్గారకంఠాస్యశుద్ధౌ తంద్రాక్లమే గతే,
స్వేదే జాతే రుచౌచాపి క్షుత్పిపాసాసహోదయే. 10.
కృతం లంఘన మాదేశ్యం నిర్వ్యథే చాంతరాత్మని,
పర్వభేదోఽంగమర్దశ్చ కాసశ్శోషో ముఖస్యచ. 11.
క్షుత్ప్రణాశోఽరుచి స్తృష్ణా దౌర్బల్యం శ్రోత్రనేత్రయోః,
మనసస్సంభ్రమోఽ భీక్ష్ణం మూర్ధ్నివాత స్తమోహృది. 12.
దేహాగ్నిబలహానిశ్చ లంఘనేఽతికృతే భవేత్.
కొలదిపాటివాతచలనము గలవానికి, ఆకలిగొన్నవానికి, దప్పికొన్నవానికి, ముఖశోషగలవానికి, భ్రమగలవానికిని లంఘనము చేయింపఁగూడదు. ఇట్టులే పిల్లలవిషయమునను, ముదుసలివారియెడలను, గర్భిణీస్త్రీలపట్టులను దుర్బలులవిషయములలోను లంఘనమును చేయింపరాదు.
అపానవాయువును, మూత్రమును, పురీషమును, చక్కగా వెడలునంతవఱకును, శరీరము తేలికయగునంతవఱకును, హృదయమునందలి పసరువెడలి శుద్ధమగునంతవఱకును గొంతుక, ముఖము పరిశుద్ధములై, ఆలస్యము, గ్లాని లేక, చెమ్మటపట్టి రుచికలుగునంతవఱకును, ఆకలిదప్పులు కలుగునంతవఱకును, అంతరాత్మలో — ఏవిధమైన కష్టము లేకయుండునంతవఱకును లంఘనము చేయుట మంచిది.
లంఘనము శక్తికిమించి చేసినయెడల కీళ్లులాగుట, (అనగా కీళ్ల పోటులుమొ.) శరీరము నలిగినట్లుండుట, దగ్గు, ముఖమువాడిపోవుట, ఆఁకలితగ్గిపోవుట, అరుచి, దప్పి, చెవులు సరిగా వినబడకయుండుట, కండ్లు మూసికొనిపోవుట, మనస్సు దిమ్మ
4 చక్రదత్త—౧. జ్వరాధికారము.
తిరుగుట, ఎగుదొప్పు కలుగుట, భ్రమము, చీకట్లుక్రమ్ముట, జఠరాగ్ని నశించుట, బల ములేక యుండుట మున్నగు నవగుణములు కలుగును.
—{ వమనమున కర్హతగలవారు; వమనముచేయించునప్పుడు గమనింపవలసిన కొన్ని ముఖ్యవిషయములు. }—
శ్లో. సద్యోభుక్తస్య వా జాతే జ్వరే సంతర్పణోత్థితే. 13
వమనం వమనార్హస్య శస్తమిత్యాహ వాగ్భటః, కఫప్రధానానుత్క్లి-
ష్టాంశ్ దోషానామాశయస్థితాన్. 14. బుద్ధ్వా జ్వరకరాన్కాలే వ-
మ్యానాం వమనేరయేత్, అనుపస్థితదోషాణాం వమనం తరుణజ్వరే.
15. హృద్రోగం శ్వాసమానాహం మోహం చ కురుతే భృశమ్, తృ-
ష్యతే సలిలం చోష్ణం దద్యాద్వాతకఫజ్వరే. 16. ¹సద్యోత్థితే పైత్తి-
కేచాథ శీతలం తిక్తకైశ్శృతమ్, దీపనం పాచనం చైవ జ్వరఘ్న-
ముభయం చ తత్. 17. స్రోతసాం శోధనం బల్యం రుచిస్వేదప్రదం
శివమ్.
అప్పుడే భోజనముచేసినవానికి, భోజనాధిక్యమువలనను, అతితృప్తివలనను జ్వర మువచ్చినయెడల నట్టివానికిని, వాంతిచేయ నర్హుఁడైనచో వాంతిచేయించుట మంచి దని వాగ్భటుఁడు చెప్పెను. కఫమే ప్రధానముగాచేసికొని వచ్చునవియును, పైతిగిన వియును, ఆమాశయమునందున్న వియును జ్వరములను గలుగఁజేయునవియు నగు దోష ములను యోగ్యకాలమునందు చక్కఁగా తెలిసికొని, అవశ్యము వమనము చేయింపతగి నచో వమనముల చేయించుటచేతనే పోగొట్టవలయును. దోషములకు, లేక దోష ములని నిశ్చయించినవానికి, తరుణజ్వరమునందు వమనము చేయించినయెడల, కడుపు నొప్పి, శ్వాసము, కడుపుబ్బుట, మోహము మున్నగువానిని కలిగించును. వాతకఫ జ్వరము వచ్చినప్పుడును, దప్పి యధికముగా గలుగువానికిని వేఁదినీటిని ఈయవల యును. అప్పుడుపుట్టిన పిత్తజ్వరమునకు, చేదుపదార్థముల చేత కాఁగినవియును, చల్లా ర్చినవియు నగుకషాయోదకముల నీయవలయును. ఈరెండువిధములయిన కషాయము లు అగ్నిని పుట్టించును. ఆహారమును పక్వముచేయును. బలమును కలిగించును. రుచిని పుట్టించును. చెమ్మటను కలిగించును. మేలు నిచ్చును.
¹ ‘మద్యోత్థితే పైత్తికేవాపి’ అని పాఠాంతరము గలదు.
ఆంధ్ర తాత్పర్యసహితము. 5
[ దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్ని గలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శిరోరోగికి గోక్షురపేయము, కోష్ఠబంధమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, మృదుమధ్యాద్యనుపాకముగా యవాగూకల్పనము, మంథపేయాదికల్పనలు, యవాగూకల్పము. ]
శ్లో. ముస్తాపర్పటకోశీర చందనోదీచ్యనాగరైః. 18. శృతం శీతం జలం దద్యాత్ పిపాసాజ్వరశాంతయే, $^{1}$ముఖ్యభేషజసంబంధో నిషిద్ధ స్తరుణే జ్వరే. 19. తోయపేయాదిసంస్కారే నిర్దోషం తేన భేషజం, యదప్సు శృతశీతాసు షడంగాది ప్రయుజ్యతే. 20. కర్షమాత్రం తతో $^{2}$దత్త్వా సాధయేత్ర్పస్థికేఽంభసి, అర్ధశృతం ప్రయోక్తవ్యం పానే పేయాదిసువిధౌ. 21. వమితం లంఘితం కాలే యవాగూభిరుపాచరేత్, యథా స్వౌషధసిద్ధాభిః మండపూర్వాభిరాదితః. 22. లాజపేయాం సుఖజరాం పిప్పలీనాగరై శ్శృతాం, పిబేజ్జ్వరీ జ్వరహరాం క్షుద్వానల్పాగ్ని రాదితః. 23. పేయాం వారక్తశాలీనాం పార్శ్వవస్తిశిరోరుజి, శ్వదంష్ట్రాకంటకారీభ్యాం సిద్ధాం జ్వరహరాం పిబేత్. 24. కోష్ఠే విబద్ధే సరుజి పిబే త్పేయాం శృతాం జ్వరీ, మృద్వీకాపిప్పలీమూల చవ్యచిత్రకనాగరైః 25. పంచమూల్యా లఘీయస్యా గుర్వ్యా తాభ్యాం సహాస్యవా, కణయా యూషపేయాది సాధనం స్యా ద్యథాక్రమం. 26. వాతపిత్తే, వాతకఫే త్రిదోషే శ్లేష్మపిత్తజే, యవాగూ స్యా త్రిదోషఘ్నీ వ్యాఘ్రీ దుస్స్పర్శగోక్షురైః. 27. కర్షార్థం వా కణాశుంఠ్యోః కల్కద్రవ్యస్య వాపలం, వినీయ పాచయే ద్యుక్త్యా వారిప్రస్థేన చాపరాం. 28. షడంగపరిభాషైవ ప్రాయః పేయాదిసంమతా, యవాగూముచితాద్భక్తా చ్చతుర్భాగకృతాం వదేత్. 29.
(షడంగపానీయము) తుంగముస్తెలు, పర్పాటకము, వట్టివేళ్లు, ఎఱ్ఱచందనము, కురువేరు, శొంఠి వీనితోటికషాయమును చేసి దాహజ్వరము పోవుట కీయవలయును. తరుణజ్వరము వచ్చినయెడల ముఖ్యముగా నౌషధము నీయరాదు. తోయ
1 ఈశ్లోకము తెలుగువ్రాతప్రతులలో కానరాదు. 2 'ద్రవ్యం' అని కొందఱి పాఠము:
6 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
పేయాది సంస్కారమును చేసినపిమ్మట నౌషధము నిర్దుష్ట మగును. ఒక ప్రస్థమును కాచిచల్లార్చఁబడిన యుదకమును తీసికొని దానియందు ఒకకర్షమెత్తు షడంగపానీయమును కలిపి, సగముమిగులునట్లుగా గాచి, పేయాదివిధమున నుపయోగింపవలయును. వాంతి చేసికొనినవానికిని, లంఘనము చేసినవానికిని తగినసమయమున గంజి నీయవలయును. మొదలను మండములను తగినయౌషధులచేసిన లాజపేయను అనఁగా, సక్తుగంజియను, [మండము, సిద్ధమండము, లాజమండము అను మున్నగుభేదముల చేత పెక్కువిధములై శ్లేష్మ, శ్లేష్మపిత్తజ్వరములను పోకార్చి రక్తవృద్ధినిం గలిగించునని సంప్రదాయజ్ఞులందురు.] పిప్పళ్లు, శొంఠి వేసి కాచిన యుదకము నిచ్చిన సుఖమగును. జ్వరముహరించును. జ్వరముగలవాఁడు అగ్నిమాంద్యముకలవాఁడై యుండినచో మొదటినుండియును జ్వరహర మగు నీపానీయమును ద్రాగవలయును. పార్శ్వపునొప్పి, తలనొప్పి కలవారలు, ఎఱ్ఱబియ్యమును పేయము చేయించుకొని త్రాగవలయును.
పల్లేరు, వాకుడు వీనిచేత సిద్ధము చేయఁబడినపేయను, చక్కఁగా కాచినదానిని త్రాగిన జ్వరము హరించును. ద్రాక్ష, పిప్పలిమూలము, చెవ్యము, చిత్రమూలము, శొంఠి వీనిచే సిద్ధము చేయఁబడిన పేయను కీళ్లుపట్టుకొనినప్పుడును, నొప్పి కలిగినప్పుడును, జ్వరితుఁడు త్రాగుచుండవలయును. లఘుపంచమూలములు, బృహత్పంచమూలములు, ధనియాలు, పిప్పళ్లు, దశమూలములు వీటితో క్రమముగా పేయను యూషమును చేసి ఈయవలయును. వాతపిత్తజ్వరములు, వాతకఫములచేతను, త్రిదోషములచేతను పిత్తముచేతను కలిగినజ్వరములను వాకుఁడు తీటకసింద, పల్లేరు వీనితోచేయఁబడిన గంజిని ఇయ్యవలయును. వాతపిత్తము, వాతకఫము, త్రిదోషములు, కఫపిత్తము వీట్లవిషయమునంద, వాకుఁడు, అంతరదామర, పల్లేరు వీట్లతోచేయఁబడిన గంజి నీయవలయును. (దీనినే హిందీలో గుడయానీ అందురు.) ఇది త్రిదోషములను హరించును. పిప్పళ్లు, శొంఠి, అర్ధకర్షముగాని, ఒకపలముగాని కల్కద్రవ్యము వీటిని 16 పలములనీళ్లలో యుక్తిగా పక్వముచేసిన నింకొకవిధమగు గంజి సిద్ధము అగును. సాధారణముగా పేయాదులయందు కళింగపరిభాషయే యంగీకరింపఁబడినయది. సామాన్యముగా భుజింపదగిన యాహారములో, అనగా ధాన్యమునకు నాల్గింతలు నీరు చేర్చి తీసిన గంజిని స్వీకరింపవలయును, దీనినే యవాగు వనియును పేయ మనియును చెప్పెదరు.
— యవాగువునుచేసెడిరీతియును, దానిని సేవింపవలసినకాలము. —
శ్లో. సిక్థైరహితో మండః పేయా సిక్థసమన్వితా, యవాగూర్బహుసిక్థా స్యా ద్విలేపీ విరళద్రవా. 30. అన్నం పంచగుణే సాధ్యం విలేపీ తు చతుర్గుణే, మండ శ్చతుర్దశగుణే యవాగూ షడ్గుణే ౩౧
आंध्र तात्पर्यसहितमु. ७
भ.सि. 31. पांशुधाने यथावृष्टिः क्लेदय त्यतिकर्दमम्, तथा श्लेष्मणि संवृद्धे यवागूश्लेष्मवर्धिनी. 32. ^1गदात्यये मद्यनित्ये ग्रीष्मे पित्तकफाधिके, ऊर्ध्वगे रक्तपित्ते च यवागूरहिता ज्वरे. 33. तत्र तर्पणमेवाग्रे प्रदेयं लाजसक्तुभिः.
इत्लु सिद्धमुचेयఁबडिन यवागुवुनंदु गल भेदमुलनु इटुपै निरूपिंचुनु. सिक्तकमुलु मिगुलनट्टुलुकाचिन गंजि मंदमुनु, सिक्तकमुलु गलदि पेययु नगुनु. चाला सिक्तमुलुगलदि कापुडुगंजि. अनఁगा यवागुवु अगुनु. इय्यदि पलचनगानगुनु. अयिदु रॆट्लनीटिलो अनఁगा ऎसरुतोवंडिन अन्नमनఁबडुनु. नालुगुरॆट्ल नीटिलो विलेपियगुनु. पदुनालुगुरॆट्ल युदकमुलो चेसिन मंद मगुनु. आरुरॆट्लनीटितो यवागु वगुनु. दुम्मुगलचोट वर्षमुकुरिसिन नॆट्लु अंबलि अनगा बुऱद यगुनो, अट्टुले श्लेष्ममु पॆఱिगिनचोट यवागुवुकूड वाडिनचो नय्यदि श्लेष्ममुनु वृद्धि नॊंदिंचुनदे यगुनु. मदात्ययरोगमुनंदुनु, नित्यमुनु मद्यमुनु द्रागुटयंदुनु, ग्रीष्मऋतुवु अनगा ज्येष्ठषाढमासमुललोनु पित्त, कफाधिक्यतवलन नगुज्वरमुलयंदुनु, ऊर्ध्वगतमगु रक्तपित्तमुनंदुनु, यवागुवु मेलु सेयदु. अनगा अपथ्यकारि यनिभावमु. असमयमुललो लाजपेललचेत दप्पि नापुट मंचिदि.
{ पित्तज्वरमुललोचेयఁदगिन पाचनविधानमु, अभिघातादुल यंदलि पथ्यविधानमु, मुद्गयूष आमलकयूषादुलु. }
श्लो. ज्वरापहैः फलरसैः युक्तं समधुशर्करं. 34. द्रवेणालोडिता स्तै स्स्युः तर्पणं लाजसक्तवः, श्रमोपवासानिलजे हितो नित्यं रसोदनः. 35. मुद्गयूषौदनश्चापि देयः कफसमुद्भवे, सएव सितया युक्तः शीतपित्तज्वरे हितः. 36. रक्तशाल्यादय श्शस्ताः पुराणाष्षष्टिकै स्सह, यवाग्वोदनलाजार्थे ज्वरितानां ज्वरापहाः. 37. मुद्गामलकयूषस्तु वातपित्तात्मके हितः, ह्रस्वमूलकयूषस्तु कफवातात्मिके हितः. 38. निम्बमूलकयूषस्तु हितः पित्तकफात्मिके, मुद्गान् मसूरां श्चणकान् कुलत्थां श्च ^2ढकानपि. 39. आहारकाले ^3यूषार्थं ज्वरिताय प्रदापयेत्,
^1 'मदात्यये' अनि कोन्निप्रतुल पाठमु.
^2 'मुकुष्ठकान्' अनिकूढ पाठमुन्नदि यट.
^3 यूषार्थे.
8 చక్రదత్త—౧. జ్వరాధికారము.
పటోలపత్రం వార్తాకం కులకం కారవేల్లకం. 40. కర్కోటకం పర్పట కం గోజిహ్వాం బాలమూలకం, పత్రం గుడూచ్యాః $^1$శ్శాకార్థం జ్వరితా య ప్రదాపయేత్. 41 జ్వరితో హితమశ్నీయాద్యద్యప్యస్యారుచిర్భ వేత్, అన్నకాలేహ్యభుంజానః క్షీయతే $^2$మ్రియతే౭పిచ. 42.
జ్వరమును హరించు ఫలరసములతో, తేనెను కండచక్కెరను కలిపినదియు ను, ద్రవపదార్థములచేత చక్కఁగాఁ గలియఁబెట్టఁబడినదియు నగు లాజసత్తువును ఈయవలయును. ఇదియే తర్పణమని చెప్పఁబడును. బలికను ఉపవాసములుచేయు టను వాతప్రకోపమువలనను గలుగుజ్వరములయందు జఠరాగ్నియున్నచో మాంస రసమునకలిపిన అన్నము హితకరమై యుండును.
కఫజ్వరములలో పెసరకట్టు (అనగా పలచని పెసరపప్పుపైనీరు) గలిపి బియ్య మును పులగముగా వండి తినుట చాలమంచిది. చక్కెరతో గలిపినచో నీగంజియే పి త్తితజ్వరములలో మేలు కలుఁగజేయును. గంజి, అన్నము, పేలాలు మొదలగు వానిని చేయుటకు, యెఱ్ఱనిబియ్యము మున్నగునవి ప్రాతవియగు షష్టికధాన్యమును [అనగా నా ల్లైలకు పండుధాన్యమును] కలిపి యుపయోగించినయెడల మిక్కిలి శ్రేష్ఠము. హిందుస్థా నీ వారు నెలలపండుధాన్యమును "సాఠీచావల్” అని యందురు. ఇవి జ్వరమును హరిం చును. పెసరపప్పు, ఉసిరికపొట్టు వీటితో చేయఁబడిన యూషము, అనగా వీటితో చేసినకట్టు వాతపిత్తజ్వరములలో మిక్కిలి హితమును గలుఁగజేయును. దీనినే ముద్గా మలక యూషమనియు నందరు.
లఘుపంచమూలములతో చేసిన యూషము కఫవాతజ్వరములయందు మిక్కిలి హితమును గలుఁగఁజేయును. వేపవేళ్లతోచేసిన యూషము పిత్తజ్వరములలో హితకర మగును. జ్వరపడినవానికి, పెసరపప్పు, పిల్లిపెసరపప్పు, సెనగపప్పు, ఉలవపప్పు, కంది పప్పు మున్నగువానిచేతను యూషమును సిద్ధముచేసి ఆహారమును తీసికొనుసమయ ముల నిచ్చుచుండవలయును. ఇవి జ్వరమువచ్చినవానికి ముఖ్యముగా ఆహారకాలముల లో యూషములకై యుపయోగించుచుండవలయును.
పొట్లఆకులు, శ్వేతవంకాయ, కాకరకాయలు, ఆఁగారకాయలు, పొట్లకాయ పర్పాటకము, ఎద్దునాలుకచెట్టు, చిన్నముల్లంగి, తిప్పతీగెఆకులు మొదలగువానిని జ్వరపీడితునకు శాకపదార్థములుగా నుపయోగింపవలెను. జ్వరమువచ్చినవానికి ఆహార సేవనకాలమందు ఏవస్తువులును హితములుగా నుండవు. అయినప్పటికిని హితవైనపదా
$^1$ శ్శాకార్థే. $^2$ మ్రియతేథవా.
ఆంధ్రతాత్పర్యసహితము. ९
...ర్థములను హితవుచేసికొని భక్షించుచుండవలయును. జ్వరపీడితుఁడు ఆహారముగా నే వస్తువులను తీసికొనకున్నయెడల క్షీణుఁడై దుర్బలుండగును. ఒక్కొక్కప్పు డిట్టికారణములచేత చచ్చిపోవుటయును కలదు, కావున రోగి హితవైనంతవట్టునకు మెల్లగా భోజనము చేయుచుండవలయును.
[అన్నము మున్నగువానిని సేవించుటలో కలుగు నరుచిని పోఁగొట్టు లేహాదులు; జ్వరభేదములు; ఆమజ్వరములందు ఔషధను సేవింపరాదనుట; పక్వజ్వరలక్షణము.]
श्लो. अरुचौ मातुलुङ्गस्य केसरं साज्यसैन्धवम्,
धात्रीद्राक्षासितानां वा कल्क मास्येन धार्यताम्। ४३।
सातत्यात्स्वाद्यभावाद्वा पथ्यं द्वेष्यत्व मागतम्,
कल्पनाविधिभि स्तैस्तैः प्रियत्वं गमये त्तुनः। ४४।
ज्वरितं ज्वरमुक्तं वा दिनान्ते भोजये ल्लघु,
श्लेष्मक्षये विवृद्धोष्मा बलवा ननल स्तदा। ४५।
गुर्वभिष्यन्द्य काले च ज्वरी नाद्या त्कथञ्चन,
नहि तस्या हितं भुक्तमायुषे वा सुखाय वा। ४६।
लङ्घनं स्वेदनं चाथ यवाग्व स्तिक्तको रसः,
पाचनान्यविपक्वानां दोषाणां तरुणे ज्वरे। ४७।
असप्तररात्रं तरुणं ज्वर माहु र्मनीषिणः,
मध्यं द्वादशरात्रं तु पुराणं मत उत्तरम्। ४८।
पाचनं शमनीयं वा कषायं पाययेत्तु तं,
ज्वरितं षडहोऽतीते लघ्वन्न प्रतिभोजितम्। ४९।
सप्ताहात्परतोऽस्तब्धे सामेस्यात्पाचनं ज्वरे,
निरामे शमनं स्तब्धे सामे नौषध माचरेत्। ५०।
लालाप्रसेको हृल्लास हृदयाशुद्ध्यरोचकाः,
तन्द्राऽलस्याविपाकस्य वैरस्यं गुरुगात्रता। ५१।
क्षुन्नाशो बहुमूत्रत्वं स्तब्धता बलवा ज्ज्वरः,
आमज్వరस्य लिङ्गानि न दद्या त्तत्र भेषजम्। ५२।
भेषजं ह्यामदोषस्य भूयो ज्वलयति ज्वरम्,
मृदौ ज्वरे लघौ देहे प्रचलेषु मलेषु च। ५३।
पक्वं दोषं विजानीया ज्ज्वरे देयं त दौषधम्।
రోగికి అన్నమునం దరుచి కలిగినయెడల మాదిఫలపు కింజల్కములును, నేయి, సైంధవలవణము వీనినిగాని; ఉసిరిక, ద్రాక్ష, చక్కెర వీనినిగాని కల్కముచేసి నోటిలో నుంపవలసినది. ఎప్పుడును ఎడతెగక పథ్యముచేయుటవలనగాని, ఆకలి లేకపోవు
2
10 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
టవలనఁ గాని, కలిగిన పథ్యవస్తువులపై నగునరుచిని అనేక విధములగు నుపపానాదుల చేత పోఁగొట్టవలయును. జ్వరము వచ్చినవానికిగాని, జ్వరము విడిచిపోయినవానికిగాని సాయంకాలమునందే లఘుభోజనమును పెట్టవలయును. శ్లేష్మము క్షయించుటచేత వేడి యధిక మగును. దానివలన జఠరాగ్ని పెంపొందును. నియమములేకుండ జ్వరితుఁడు గురుపదార్థములను, ప్రవర్తులఁ గలుగఁజేయు పదార్థ లను భుజింపరాదు. అట్టివానిని భుజించుట ఆయుష్యమునకును, సుఖమునకును, మంచికొఱకును కాదు.
లంఘనముచేయుట, ఆవిరిపట్టుట, గంజి, చేదగుకషాయములు నివి పక్వము గాని యన్నివిధములగు జ్వరములను పక్వము చేయును. వరుసగా నేడురాత్రులవఱకు వచ్చెడి జ్వరమును తరుణజ్వరమని పండితులు చెప్పెదరు. ఇట్లే పండ్రెండురాత్రులవఱకు వచ్చెడిదానిని మధ్యమజ్వర మనియెదరు. ఇంతకంటె నధికముగా వచ్చెడిజ్వరమును పురాణజ్వరమునుగా చెప్పెదరు.
జ్వరముగలవాఁడు పాచనమును శమనమును చేయు కషాయమును త్రాగవలయును. ఆరురోజులు గడచిపోయిన పిమ్మట లఘువగు నన్నమును భుజింపవలయును. ఏడురోజుల పైన సాధారణములగు నామజ్వరములయందు పాచనము చేయుటయును, ఆమరహితమగు జ్వరములలో శమనముచేయుటయును, తీక్ష్ణమగు నామజ్వరములలో ఔషధమునే ఈయకుండుటయు నుత్తమము. ముఖము ఎఱ్ఱబాఱుట, ఉమ్మిన కషాయపురంగుగావచ్చుట, హృదయము నిర్మలముగానుండకుండుట, రుచిపుట్టకుండుట, తంద్రాద్యస్యములు కలుగుట, దోషములు పక్వములు గాకయుండుట, నోటినుండి ఉమ్మి యెక్కువగా నుండుట, దేహము బరువుగా నుండుట, ఆకలిలేకపోవుట, మూత్ర మెక్కువగా స్రవించుట, జ్వరముగల రోగి బలవంతుఁడుగానుండుట ఇయ్యది ఆమజ్వరలక్షణములు కావున నిట్టియెడ నౌషధము నీయరాదు. ఆమజ్వరరోగుల కీయఁబడిన యౌషధము మఱల జ్వరమును ప్రకాశింపఁజేయును. జ్వరము తగ్గుకొలఁదిని, దేహము చులకనగుకొలఁదిని, మలము వెడలుకొలఁదిని దోషము పక్వమైనట్టులు తెలిసికొని అప్పుడు ఔషధము నీయవలయును.
[త్రిదోషజ్వరార్థము పాచనకషాయము; శోధన చేయఁదగినవారు; స్త్రీలు పిల్లలు ఔషధమును సేవించుటలో గమనింపఁదగినవిధి; ఔషధము జీర్ణించినట్లు తెలిసికొనుగుర్తులు; అట్లే జీర్ణింపనిగుర్తులు; జీర్ణింపకముందు ఆహారాదులు సేవించినయెడల వచ్చు ప్రమాదములు; స్త్రీ బాలవృద్ధులు ఔషధమును సేవించురీతి.]
శ్లో. నాగరం దేవకాష్ఠం చ ధాన్యాకం బృహతీద్వయమ్, దద్యా త్పాచనకం పూర్వం జ్వరితాయ జ్వరాపహమ్. 54. పీతాంబు
ఆంధ్ర తాత్పర్యసహితము. 11
ర్లంఘితః క్షీణః $^1$జీర్ణి భుక్తః పిపాసితః, న పిబేదౌషధం జంతుః సంశోధన మథేతదత్. 55.
వీర్యాధికం భవతి భేషజ మన్నహీనం హన్యాత్తదామయ మసంశయ మాశుచైవ, తద్బాలవృద్ధయువతీమృదుభిశ్చ పీతం, గ్లానిం పరాం నయతి చాశు బలక్షయం చ. 56.
అనులోమోఽనిలస్స్వాస్థ్యం క్షుత్తృష్ణాసుమనస్కతా, లఘుత్వమింద్రియోద్గారశుద్ధిర్జీర్ణౌషధాకృతిః. 57.
క్లమో దాహోంగసదనం భ్రమో మూర్ఛా శిరోరుజా, అరతిర్బలహానిశ్చ సావశేషౌషధాకృతిః. 58.
ఔషధశేషే భుక్తం పీతం చ తథౌషధం సశేషేఽన్నే, ప్రకరోతి గదోపశమః ప్రకోపయత్యన్యరోగాంశ్చ. 59.
శీఘ్రం విపాక ముపయాతి బలం న హింస్యాదన్నావృతం నచ ముహు ర్వదనా న్నిరేతి, ప్రాగ్భుక్తసేవిత మథౌషధ మేతదేవ దద్యాచ్చ వృద్ధ శిశు భీరు వరాంగనాభ్యః. 60.
అన్నివిధములగు జ్వరములకును, శొంతి, దేవదారు, ధనియములు, పెద్దములక, చిన్నములక అనుబృహతీద్వయంగల రెండువిధములనుతెచ్చి నీటితో కాచిన కషాయమును పాచనమునకై జ్వరితున కీయవలయును. ఇయ్యది జ్వరమును పోగొట్టును. నీటిని త్రాగినవాఁడును, లంఘనముచేసినవాఁడును, దప్పిగొని యున్నవాఁడును, కృశించినవాఁడును, అజీర్ణరోగీయును, భుజించినవాఁడును, ఔషధమునుగాని, ఇతరవిధమగు శోధనను గాని సేవింపరాదు.
అన్నములేని యౌషధము పరాక్రమవంత మగును. ఇట్టియౌషధ మాతురును చంపివైచును. సందేహము వలదు. కావున పిల్లలు, వృద్ధులు, యౌవనవతు లగు స్త్రీలు, మృదుశరీరులు మున్నగువా రౌషధమును అన్నములేక సేవించిన బడలిక నొందుదురు. శీఘ్రముగా బలమును నశించును. ఈవిషయమున సందేహము బొత్తుగా వలదు.
అనుకూలముగా వాయువువెడలుట, స్వస్థుఁడై యుండుట, ఆఁకలి దప్పికం గలిగియుండుట, మనస్సు నిర్మలముగానుండుట, శరీరము తేలికగా నుండుట, ఇంద్రియములు కలుషితములుగాక ప్రసన్నములై యుండుట, త్రేపులు రాకుండుట మున్నగునవి జీర్ణౌషధునకు అనఁగా నౌషధము జీర్ణించినవానికి లక్షణములు. వాఁడెబాఱుట, ఆయాసమునొందుట, దప్పిగొనియుండుట, కాళ్లుచేతులు మొదలగు నవయవములు లాగుచుండుట, భ్రమకమ్ముట, మూర్ఛిల్లుట, తలనొప్పి, అసహ్యము, అరుచి మున్నగునవి, మనోవ్యాకులము అనునీయవి కలయప్పుడు, ఔషధము జీర్ణముకాక శేషించియున్న దని తెలిసికొనవలయును.
1 'జీర్ణో' అనికూడ పాఠమున్నది.
12 चक्रदत्त—१. ज्वराधिकारमु.
औषधमु पूर्णमुगा जीर्णिम्पकमुन्दु तिनिनयन्नमुनु, त्रागिननीरुनु, आविधमुगाने अन्नमु सम्पूर्णमुगा जीर्णिम्पक मुन्दु तीसिकोनिन यौषधमुनु, रोगमुनु शान्ति नोन्दिम्पदु. पैगा निदि इंकनु इतररोगमुलनु पुट्टिंचुनु. अन्नावृतमैन यौषधमु, अनఁगा अन्नमु चक्कఁगा जीर्णमैनपिम्मट दानितो इमिडिकबोन्दिनदैनचो अट्टिऔषधमु त्वरगा पक्वमै जीर्णिंचुनु. बलमुनु नशिम्पनीयदु. नोटिनुण्डि माटिमाटिकि वेल्लिरादु. ईपैनि चेप्पियुन्न तेఱఁगुन यौषधमुनु साधारणमुगा वैद्युलु मुदुसलिवारिकि, पिल्ललकु, भयस्वभावमु गलवारिकि, सौन्दर्यवतुलगु नारीमणुलकुनु ईयवलयुनु.
{ औषधमुनु सेविंचुनप्पुडु गमनिम्पवलसिन मात्रापरिणाममु; क्वाथादि औषधमुल विषयमुलोगल परिमाणमु, कषायविषयमुन वैद्युल परिभाषा. }
श्लो. मात्राया नास्त्यवस्थानां दोषमग्निं बलं वयः ।
व्याधिं द्रव्यं च कोष्ठं च वीक्ष्य मात्रां प्रयोजयेत् ॥ ६१ ॥
उत्तमस्य पलं मात्रा त्रिभिश्शाक्षैश्च मध्यमे । जघन्यस्य
पलार्धेन स्नेहक्वाथौषधेषु च ॥ ६२ ॥ कर्षादातु पलं यावद्द-
द्यात् षोडशिकं जलं । ततस्तु कुडपं यावत् तोयमष्टगुणं
पिबेत् ॥ ६३ ॥ क्वाथ्यद्रव्यपले कुर्यात्प्रस्थार्थं पादशेषितम् ॥
रोगुलकु औषधमु निच्चुनप्पुडु साधारणमुगा मात्रल निंतंतलुगा नित्वु ईयवलयु ननु साधारणमुगा नियममु लेदु. कानि वैद्युडगुवाडु, रोगिकिंगल दोषमुनु बलमुनु वयस्सुनु व्याधिनि औषधमुनु जठरकोष्ठमुनु चक्कఁगा बरीक्षिंचि तदनुसारमुगा नौषधमात्रलclinical నుపయోగింపవలయును. तैलसुकल्कमु मुन्नगुवानि नुपयोगिंचुनप्पुडु उत्तममगुमात्र (अनఁगाजठराग्निकलवानिकिच्चेडि मात्र) पलप्रमाण मुण्डवलयुनु. मध्यममु मूఁडुकर्षमुल परिमाणमुन नुण्डवलयुनु. अंतकंटे दक्कुव परिमाणमुगल मात्र यन्निटिकंटे नधममु अनेदरु. स्नेहकषायमुलఁ दयारुचेयुटो ओककर्षमु मोदलुकोनि पल प्रमाणमुवरकु गलवानिकि, पदियारुरेत्ल नीटिनि चेर्पवलयुनु. पलमु मोदलुकोनि कुडपमुवरकु गलवानिकि नेनिमिदिरेत्लु उदकमुनु चेर्चवलयुनु. कल्कमुलु मुन्नगु प्रत्येक क्वाथादुलयन्दु ओकपलमौ यौषधमुनकु प्रस्थपरिमाणमु नीटिलो पक्वमुचेसि नाल्गवभागमु नीरु मिगुलुनट्लु चेयवलयुनु. (दीनिने पादावशेष विधि यनि यन्दुरु.)
आन्ध्र तात्पर्यसहितमु. 13
पलपरिमाणविषयमुन चरकादुल मतभेदमुलु.
श्लो. द्वात्रिंशन्माषकैराषश्चरकस्यतु तैः पलम्। 64।
अष्टचत्वारिंशता स्या त्सुश्रुतस्य तु माषकैः, द्वादशभि र्धान्यामाषै श्चतुष्षष्ट्यातु तैः पलम्। 65।
एतच्च तुलितं पंचरक्तिमाषात्मकं पलम्, चरकार्थपलोन्मानं चरके दशरक्तिकैः। 66।
माषैः पलं चतुष्षष्ट्या यद्भवेत् तत्प्रेरितं, तस्मा त्पलं चतुष्षष्ट्या माषकै रथरक्तिकैः। 67।
चरकानुमतं वैद्यै श्चिकित्सा सूपयुज्यते।
चरकमहामुनि मतेऽनुसारमुगा मुप्पदि रॆंडु माषमुल [मिनपगिंजल] यॆत्तु ऒक माषमगुनु. 48 माषमुलयॆत्तु पल मगुनु. इतनिमतमुन नॊकपलमुनकु पदि रक्तिकलनियंदुरु. सुश्रुतुनि मतानुसारमु 12 माषमुलयॆत्तु माषमुनु 64 माषमुलयॆत्तु पलमगुनु. ईमतमुन पलमनఁगा (अनगा 5 रतुल [रक्तिकुलु] यॆत्तु गलदि) पलमगुनु. इय्यदि अनఁगा सुश्रुतुनियॆ दरक्तिकुलु, चरकमुनि यर्थपलमुनकु समानमु. पदि रतुलु माषमनि यंदुरु. 64 माषमुल चेतनगुपलमे इच्चट ग्रहिंपఁबडुनु. वैद्युलु चरकुनि मतानुसारमुगने चिकित्सलयं... पलादिपरिमाणमुलनु उपयोगिंचुचुन्नारु.
{वातज्वरमुनकु चिकित्सलु; बिल्वादिपंचमूलकषायमु; नेलवेमुकषायमु; रास्नादिकषायमु; पिप्पलादिकषायमुलु; द्राक्षादिक्वाथमु.}
श्लो. बिल्वादिपंचमूलस्य क्वाथस्स्याद्वातके ज्वरे। 68।
पाचनः पिप्पलीमूलंगुडूची विश्वजोधवा, किराताब्द्दामृतोदीच्यबृहतीद्वय गोक्षुरैः। 69।
सस्थिराकलशीविश्वैः क्वाथो वातज्वरापहः, रास्ना वृक्षादनी दारु सरलं शैलवालुकम्। 70।
कषायश्शर्कराक्षौद्रयुक्तो वातज्वरापहः, प्रक्षेपः पादिकः क्वाथात्स्नेहे कल्कसमो मतः। 71।
परिभाषामिमामन्थे प्रक्षेपॊऽप्युचिरे यथा, कर्ष चूर्णस्य कल्कस्यगुटिकानांच सर्वशः। 72।
द्रव्यशुक्त्या सलेढव्यः पातव्यश्चतुर्द्रवैः, मात्राक्षौद्रघृतादीनां स्नेहे क्वाथेषु चूर्णवत्। 73।
बिल्वादिपंचमूलीच गुडूच्यामलके तथा, कुस्तुंबुरुसमोह्येष कषायो वातिके ज्व-
14 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
శ్లో. 74. పిప్పలీ శారివా ద్రాక్షా శతపుష్పా హరేణుభిః, కృతః కషాయ స్సగుడో హన్యాత్పవనజం జ్వరమ్. 75. గుడూచీ శారివా ద్రాక్షా శతపుష్పా పునర్నవా, సగుడోఽయం కషాయ స్స్యాత్ వాతజ్వరవినాశనః. 76. ద్రాక్షా గుడూచీ కాశ్మర్యం త్రాయమాణా స్వశారిగాః, నిష్క్వాథ్య సగుడం క్వాథం పిబే ద్వాతజ్వరాపహమ్. 77. శతావరీ గుడూచీభ్యాం సర్వసో యంత్రపీడితః, గుడప్రగాఢ శ్శమయేత్ సద్యోఽనిలకృతం జ్వరమ్. 78.
బిల్వాది పంచమూలములు వీటికషాయమును గాని, వాతజ్వరితుల కీయవలయును. లేనిచో పిప్పలీమూలము, తిప్పతీగె శొంఠితో చేసిన కషాయమునైన నిచ్చినచో వాతజ్వరములు పక్వము లగును. నేలవేము, తుంగముస్తలు, తిప్పతీగె, కులువేరు, పెద్దములక, చిన్నములక, విరుగుడుపల్లేరు, నయ్యారుపాపన్న, కొలపొన్న, శొంతి వీటికషాయము (అనఁగా వీటిని సమభాగములుగ వేసి చేసినకషాయము) వాతజ్వరములను నాశనము చేయును.
సన్నరాష్ట్రీము, బదనిక, సరళ దేవదారు, ఏలకులు, కూతురుబుడమ వీనిని సమభాగములుగా వేసి కషాయముగా గాచి తేనెతోను, చక్కెరతోను కలిపి పుచ్చుకొనిన వాతజ్వరములు నిర్మూలములగును. కల్కమైనయెడల నివి (అనఁగా శర్కర, తేనె మొదలగునవి) నాల్గవభాగమును కలుపవలయును. తైలమునందు సమానభాగమును వేయవలయును. ఈ తైలమును చేయుటయందు చెప్పినట్లు క్రింద చూపించుచున్నాము. చూర్ణము, కల్కము, మాత్రలు, గుటికలు చేయునప్పుడు పలప్రమాణము మాత్రమే శర్కర, తేనె సమముగా చేర్చవలెను. ఇట్లే పాకవిధిలో చిక్కగాచేయు నెడల ద్రవమునకు రెట్టింపుగను, ఇంకను ద్రవరూపముగ జేయు నెడల నాల్గురెట్లును నీటిని చేర్చవలయును.
తేనె, నేయి మొదలగువానివిషయములో మాత్ర ప్రమాణ మెట్లనఁగా: చనురులో చూర్ణమువలె సమముగా చేర్చుటయుత్తమము. బిల్వము మొదలుగాగల పంచమూలములు వీనికే గురుపచమూలములని పేరు. తిప్పతీగె, ఉసిరిక, కొత్తిమరలు వీనిని అన్నిఁటిని సమానభాగములుగా వైచి కాచిన కషాయము వాతజ్వరమును పోఁగొట్టఁగలదు. పిప్పళ్లు, సుగంధపాల, ద్రాక్ష, సదాప, రేణుకయను గంధద్రవ్యము, సోపు వీట్ల తోటికాఁచఁబడిన కషాయమునందు బెల్లముగలిపి త్రాగినయెడల వాతజ్వరములు నశించిపోవును.
ఆంధ్రతాత్పర్యసహితము. 15
ద్రాక్ష, తిప్పతీగె, సుగంధిపాల, సడాప, తెల్లగల్లేరు వీటితో సమభాగముగ కాచినకషాయమునందు బెల్లమునుకలిపి సేవించిన నది వాతజ్వరములను మొదలంటునట్లు అణచివేయును. ద్రాక్ష, తిప్పతీగె, వట్టివేర్లు, కలుక్రానుగ వీటినివేసి కాచినకషాయములో మంచిబెల్లమును గలిపి త్రాగిన వాతజ్వరము నశించిపోవును. తిప్పతీగె వీటిని యంత్రములోనుంచి మర్దించి, వీటినుండితీయఁబడిన రసమునందు బెల్లమును కలిపి త్రాగినయెడల తత్క్షణమే వాతప్రకోపమువలనఁ బుట్టిన జ్వరమును నశింపఁజేయును.
[పిత్తజ్వరచికిత్సలు; కళింగాదికషాయము; తిక్తాదిచూర్ణము; గూడూచీక్వాథము; పటోలాదిగుటికలు; దూలగొండిస్వరసము; త్రాయమాణాదిక్వాథములు, మృద్వీకాదికషాయములు, పర్పటకక్వాథము; శుంఠ్యాదికషాయము; ద్రాక్షాదికషాయము.]
శ్లో. కళింగం కట్ఫలం ముస్తం పాఠాం తిక్తకరోహిణీమ్, పక్వం సశర్కరం పీతం పాచనం పైత్తికే జ్వరే. 80.
సక్షౌద్రం పాచనం పైత్తే తిక్తాబ్దేన్ద్రయవైః కృతమ్, లోధ్రోత్పలామృతా పద్మశారివాణాం సశర్కరః. 81.
క్వాథః పిత్తజ్వరం హన్యాదథవా పర్పటోద్భవః, *
$^1$పటోలేన్ద్రయవక్వాథో మధునా మధురీకృతః. 82.
తీవ్రపిత్తజ్వరామర్దీ పానాత్తృష్ణాదాహనాశనః,
దురాలభా పర్పటక ప్రియంగు ధ్వనింబవాసా కటురోహిణీనామ్,
జలం పిబేచ్ఛర్కరయావగాఢం, తృష్ణాస్రపిత్తజ్వరదాహయుక్తః. 83.
త్రాయమాణాం చ మధుకం పిప్పలీమూల మేవచ,
కిరాతతిక్తం ముస్తం మధుకం సవిభీతకమ్. 84.
సశర్కరం పీతమేతత్పిత్తజ్వర$^2$నిబర్హణం,
మృద్వీకా మధుకం నింబం కటుకా రోహిణీసమా. 85.
అవశ్యాయశీతం పక్వమేతత్పిత్తజ్వరాపహమ్,
ఏకః పర్పటక శ్శీతఃపిత్తజ్వరం వినాశనః. 86.
కింపున ర్యది యుజ్యేత చందనోదీచ్యనాగరైః,
విశ్వాంబుపర్పటోశీరఘనచందనసా
* [గూడూచీపద్మ లోధ్రాణాం శారిబోత్పలయో స్తథా, శర్కరామధురః క్వాథః శీతః పిత్తజ్వరాపహారీ.] ఈశ్లోకము కొన్నిప్రతులలో నున్నది. తిప్పతీగెకమలములు, లొద్దుగచెక్క వీటితోగాని, సుగంధిపాలకలువలు వీటితోగాని సమభాగముగ కషాయముగాచి చెక్కరవైచిచల్లార్చి త్రాగిన పిత్తజ్వరములు హరించునని దీనిభావము. ఇది సుశ్రుతములో నున్నది.
$^1$ 'పటోల యవనిష్క్వాథ'. $^2$ 'వినాశకమ్' అని పాఠాంతరములు,
16 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
ధితం. 87. దద్యాత్సుశీతలం వారి తృట్ ఛర్ది జ్వరదాహనుత్, పర్పటా
మృతధాత్రీణాం క్వాథః పిత్తజ్వరాపహః. 88. ద్రాక్షారగ్వధయోశ్చాపి
కాశ్యర్య శ్చాథవాపునః. 89. ద్రాక్షాభయా పర్పటకాబ్దతిక్తా క్వాథం
ససమ్యాకఫలం విదధ్యాత్, ప్రలాపమూర్ఛా భ్రమదాహ శోష
తృష్ణాన్వితే పిత్తభవే జ్వరే తు. 90.
పిత్తజ్వరముకు చేయవలసిన చికిత్స.—కోడిసెవిత్తనాలు, నేలగుమ్ముడు, తుంగముస్త, చేదుపొట్ల, అగరుశొంతి, కటుకరోహిణి వీటిని సమముగా నీటిలో వైచి చక్కగాకాచి శర్కరనువైచి పిత్తజ్వరముగలవారి కీయవలయును. ఇది పిత్తజ్వరమునకు చేయఁదగిన పాచనము. చేదుపొట్ల, తుంగగడ్డలు, కోడిసెపాలవిత్తులు వీనిచేతఁ చేయఁబడిన పాచనమునందు తేనెకలిపి వాడవలయును. లొద్దుగు, నల్లకలువ, తిప్పతీగ, కమలములు, సుగంధిపాల వీట్ల సమభాగములతోఁ జేయఁబడిన కషాయమునందు చక్కెరనుకలిపి త్రాగిన పిత్తజ్వరమును నశింపఁ జేయును. పర్పాటకముతోఁ జేయఁబడిన కషాయమైనను పిత్తజ్వరములను పోఁగొట్టఁగలుగును. చేతిపొట్ల, యవలు వీటితో కాచఁబడినకషాయమునందు తేనెను కలిపి తీపిగలిగించి త్రాగినయెడల అతీతీవ్రముగా వచ్చిన పిత్తజ్వరములైనను నశించిపోవును. ఈకషాయము త్రాగినంతనే అతిదాహము మున్నగు నవగుణములును నశించిపోవును.
దూలగొండి, పర్పాటకము, ప్రేంకణపుచెక్క, నేలవేము, అడ్డసరము, కటుకరోహిణి వీటితోసిద్ధముచేసిన స్వరసమునందు శర్కరను మిశ్రముచేసి త్రాగి యెడల విదాహము, చెమట, పిత్తజ్వరమును నశించిపోఁగలవు. కలుక్రానుగ, మధుకము, మోడి, వాయువిడంగము, చేదుపొట్ల, ముస్త, తుంగముస్తలు, విష్ణుపువ్వు, తాడికాయ దీనితో సమభాగముగ పక్వముచేయఁబడిన కషాయమునందు చక్కెరను కలిపి త్రాగిన పిత్తజ్వరములు నశించి పోఁగలుగును.
ద్రాక్ష, యష్టిమధుకము, వేపవేళ్లు, లేక వేపచెక్క, కటుకరోహిణి వీనినిసమాన భాగములను తీసికొని మంచునీటిచే పాకమునుచేసి త్రాగించిన పిత్తజ్వరము లణగిపోవును. ఇదియే పిత్తజ్వరములకు పాచనము లేనిచో కేవల మొక్కపర్పాటకమే పిత్తజ్వరములనణంచుటలో నుత్తమముగాఁ బనిచేయగలదు. ఇది ఎఱ్ఱగండపుపొడి, కురువేరు, శొంతి మున్నగువానితో గూడినచో నిఁక దాని ప్రభావము చెప్పుటకు నేవియిగునా? అనఁగా నత్యంత ముత్తమ మనుట.
శొంతి, కురువేరు, పర్పాటకము, వట్టివేరు, తుంగగడ్డలు, ఎఱ్ఱగంధపుపొడి వీనిచేత సమభాగముగా సిద్ధముచేయఁబడిన చల్లనియుదకము దప్పి, ఛర్ది విదాహముగల
17 ఆంధ్ర తాత్పర్యసహితము.
పిత్తజ్వరమును పోఁగొట్టును. పర్పాటకము, ఉసిరిక వీటితో చేయఁబడిన క్వాథము నుగాని; ద్రాక్ష, తిప్పతీగె, రేలచెక్క వీటితో చేయఁబడిన కషాయముగాని పిత్తజ్వర మును పూర్ణముగా నశింపఁజేయును. ద్రాక్ష, కరక్కాయ, పర్పాటకము, తుంగముస్త లు, కటుకరోహిణి, రేలచెక్క వీటితో సమభాగముగ సిద్ధము చేయఁబడిన క్వాథ మును, ప్రలాపము, మూర్ఛపోవుట, భ్రాంతికమ్ముట, అతిదాహము, సొమ్మసిల్లుట, దప్పి, అరకయుండుట ఈమొదలగు గుణము లుండెడి, పిత్తజన్యమైన జ్వరము వచ్చినరోగికి యిచ్చినయెడల నెమ్మది కలుగును.
[పిత్తజ్వరము గలవానికి శీతక్రియలు; ధాన్యాకశృతము; అభ్యంజ నము; శిరోలేపనము; ఉద్వర్తనాదులు; కాంజిక వస్త్రధారణము; మాతులుంగబంధనము.]
శ్లో. ప్యుషితం $^1$ధాన్యకజలం ప్రాతః పీతం సశర్కరం పుంసామ్,
అంతర్దాహం శమయత్యచిరాద్దూరప్రరూఢమపి. 91.
పిత్తజ్వరేణ తప్తస్య క్రియాం శీతాం సమాచరేత్,
విదారీదాడిమం లోధ్రం $^2$దధిత్యం బీజపూరకమ్. 92.
ఏభిః ప్రదిహ్యాన్నూరానం తృడ్దాహార్తస్య దేహినః,
ఘృతభృష్టామॢపిష్టాచ ధాత్రీలేపాచ్చ దాహనుత్. 93.
ఆమ్లపిష్టైస్సుశీతైర్వా పలాశతరుణై $^3$ర్దిహేత్,
బదరీపల్లవోత్థేన ఫేనేనారిష్టకస్య $^4$చ. 94.
కాలేయ చందనానూతా యష్టీబదర కాంజికైః,
సఘృతై స్స్యార్ఛిరోలేప స్తృష్ణాదాహర్తిశాంతయే. 95.
ఉత్తానసుప్తస్య గభీరతామ్ర కాంస్యాదిపాత్రం ప్రణిధాయ నాభౌ,
తత్రాంబుధారా బహుళా పతంతీ నిహంతి దాహం త్వరితం సుశీతా. 96.
శీతకాంజిక వస్త్రావగుంఠనం దాహనాశనమ్,
జిహ్వాతాలుగలక్లోమ శోషే మూర్ధ్నితు దాపయేత్. 97.
కేసరం మాతులుంగస్య మధు సైంధవసంయుతమ్.
పిత్తజ్వరమునకు చేయవలసిన శైత్యోపచారములను చెప్పుచున్నాఁడు — ధనియాలను నీటిలో రాత్రియంతయును నానవైచి, ఆనీటిని చక్కెర గలిపికొని త్రాగినయెడల నొగులకు కలిగిన భయంకరమగు సంతర్దాహము ముదిరినదైనను శీఘ్రముగా నశిం
1 ధాన్యకజలం. 2 కపిత్థం. 3 ర్దిహేత్. 4 వా.
3
18 చక్రదత్త—౧. జ్వరాధికారము.
చిపోఁగలదు. పిత్తజ్వరముచే సంతాపము కలిగినమనుష్యునికి శీతలోపచారము అవశ్యముగాఁ జేయవలయును.
నేలగుమ్ముడు, దానిమ్మపండు, లొద్దుగ, వెలగ, మాదీఫలము వీటిని అనఁగా కేసరములను నీటితో మెత్తగానూరి, దాహము ఎక్కువగా గలిగిన రోగియొక్క మాడునక పట్టు వేయవలయును. నేతిలోఁగాని, నిమ్మపండ్లరసములోఁగాని, ఉసిరిగపొట్టును ఆమ్లకాంజికముతో నూరి పట్టువేసినయెడల దాహ మణఁగిపోవును. మోదుగచిగుళ్లనుగాని, పూవులనుగాని ఉసిరిగపొట్టునుగాని ఆమ్ల కాంజికముతో నూరి పూసినను దాహము శాంతి నొందఁగలదు. రేగుఆకులను పిండగా వచ్చినరసముతో కుంకుడుకాయల నురుగు చేసి పూసినను తగ్గిపోవును. హరిచందనము, నల్లసుగంధిపాల, యష్టిమధుకము, రేగుపండ్లు వీనిని గంజితోనూరి దానిలో నేతిని కలిపి తలను పట్టు వేసినయెడల, తృష్ణ, దాహము కలిగిన జ్వరములైనను నశింపఁజేయును.
మనుష్యుని (అనగా రోగిని) వెల్లకిలఁ బరుండఁ బెట్టి, ఆమనుష్యునిబొడ్డుపైన లొత్తైనరాగిపాత్రనుగాని కంచుపళ్లెమునుగాని పెట్టి, ఆపాత్రయందు సన్నగా చాల ఎత్తునుండి నీటిని ధారకట్టునట్లు పోసినయెడల అతిదాహమును త్వరగాఁ తగ్గించివైచును. చల్లనినీటిలోనుగాని, గంజిలోఁగాని గుడ్డను ముంచి శరీరముపై నుంచినయెడల దాహ ముపశమించిపోవును. నాలుక, దవడలు, గొంతుక, దాహస్థానము ఇవి పైత్యజ్వరాధిక్యముచేత ఎండిపోయిన యప్పుడు తలపైని మాదీఫలమును, తేనె, సైంధవలవణము వీనినినూరి లేపనము చేయవలయును.
[కఫజ్వరచికిత్స:— మాతులుంగాదిచూర్ణము; కఫహరద్రవ్యములు; కటుకాదిక్వాథములు; నింబాదికషాయములు; దీపనపాచన యోగములు, త్రిఫలాముస్తాదిక్వాథములు.]
మాతులుంగ శిఫా విశ్వ బ్రాహ్మీ గ్రంథికసంభవమ్. 98. కఫజ్వరేంబుసక్షారం పాచనంవా కణాదికం, పిప్పలీ పిప్పలీమూలం చవ్యచిత్రకనాగరమ్. 99. మరీచైలాజమోదేంద్ర పాఠారేణుకజీరకం, భార్జీ మహానింబఫలం హింగురోహిణిసర్షపం. 100. విడంగాతివిషే మూర్వా చేత్యయం కీర్తితోగణః, పిప్పల్యాదిః కఫహరః ప్రతిశ్యారోచక¹నిలాన్. 101. నిహన్యాద్దీపనో గుల్మశూలఘ్నస్త్వామపాచనః, కటుకం చిత్రకం నింబం హరిద్రాతివిషే ²వచాం. 102. కుష్ఠ మింద్ర
1 జ్వరాన్. 2 వచా.
ఆంధ్ర తాత్పర్యసహితము. 19
యవం మూర్వాం పటోలం చాపి సాధితం, పిబే న్మరిచసంయుక్తం సక్షౌద్రం శ్లైష్మికే జ్వరే. 103. నింబవిశ్వామృతా దారు శటీభూనింబపౌష్కరం, పిప్పల్యా బృహతీచేతిక్వాథో హంతి కఫజ్వరం. 104. సింధువారదల¹క్వాథం శోషణం కఫజే జ్వరే, జంభూయోశ్చ బలే క్షీణే కర్లే వా విహితే పిబేత్. 105. ఆమలక్యభయా కృష్ణా చిత్రక శ్చేత్యయం గణః, సర్వజ్వరకఫాతంకభేదీ దీపనపాచనః. 106. త్రిఫలాపటోలవాసాచ్ఛిన్నరుహా తిక్తరోహిణీ షడ్గ్రంథాః, మధునా శ్లేష్మసముత్థే దశమూలీవాసకస్య వా క్వాథః. 107. ముస్తం వాత్స్యకబీజాని త్రిఫలా కటురోహిణీ, పరూషకాణి చ క్వాథః కఫజ్వరవినాశనః. 108.
కఫజ్వరచికిత్సా:— మాదీఫలము, శొంతి, సరస్వతిఆకు, మోడి, వట్టివేరు వీటితో చేసిన క్వాథమునందు యవక్షారమును కలిపి త్రాగినయెడల కఫజ్వరములు నశించును. కణాదిక్వాథముచేతఁగూడ నీకఫజ్వరములు పోఁగలవు. కణాదిక్వాథ మనఁగా పిప్పల్యాదికమును వేసి కాచిన కషాయము. పిప్పళ్లు, మోడి, చవ్యము, చిత్రమూలము, శొంతి, మిరియములు, ఏలకులు, ఓమము, దాల్చినపట్ట, అగరుశొంతి, రేణుకలు, జీలకఱ్ఱ, గంటభారంగి, గజనిమ్మపండు, ఇంగువ, కటుకరోహిణి, ఆవాలు, వాయువిళంగములు, అతివస, చాగవేళ్లు వీటిని కఫహరమగు కణాదిగణమని చెప్పెదరు. అనఁగా పిప్పల్యాదిగణపతితము లగు శబ్దము లని యర్థము.
ఈపిప్పల్యాదిగణము కఫమును పోఁగొట్టును. మఱియును, పీనస లేక పడిశెము, అరోచకము, వాతరోగము అనువానిని నశింపఁజేయును. జఠరాగ్నిని దీపింపఁజేయును, గుల్మము, శూలరోగము వీటిని మొదలంట నశింపఁజేయును. ఆమమును పక్వముజేయును. కటుకరోహిణి, చిత్రమూలము, వేపచెక్క, మ్రానిపసపు, అతివస, వస, చెంగల్వకోష్టు, కొడిసెపాలవిత్తులు, చాగవేళ్లు, చేదుపొట్ల, (పొట్లఆకులని కొందఱు) వీటితో కషాయమును సమభాగముగఁజేసి మిరియములచూర్ణమును తేనెను కలిపి త్రాగిన కఫజ్వరములు నశించును.
వేపచెక్క, శొంతి, తిప్పతీగె, దేవదారుచెక్క, కచ్చూరము, నేలవేము, పుష్కరమూలము రెండువిధములగు పిప్పళ్లు, అనఁగా పిప్పళ్లు, గజపిప్పళ్లు, పెద్దములక వీటిని కషాయమునందు వైచి కాచి కఫజ్వరములు గలవారిచేత త్రాగించుచుండవలయును. తెల్లవావిలిఆకుతోచేసిన క్వాథము కఫజ్వరమును ఎండింపఁజేయును. మఱి
¹ క్వాథః.
20 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
యును, పిక్కలయందు బలములేనియప్పుడును, చెవులు మూసికొని పోయినప్పుడును . ఈకషాయమును సేవించినయెడల హితము కలుగును. ఉసిరిక, కరక్కాయ, పిప్పళ్లు, చిత్రమూలము, ఈగణము అన్ని విధములైన కఫజ్వరములను పోఁగొట్టును.
అడ్డసరము, తుంగముస్తలు, కొడిశెపాలవిత్తనములు, త్రిఫలములు, కటుకరో హిణి, చిట్టితకాయలు వీటితోటి చేయఁబడిన క్వాథము కఫజ్వరమును పోఁగొట్టును.
— ౨౦ చాతుర్భద్రావలేహిక; శ్వాసాదులకు పిప్పలీచూర్ణము; ద్వంద్వజ్వర చికిత్స. ౨౦ —
శ్లో. కట్ఫలం పౌష్కరం శృంగీకృష్ణాచ మధునాసహ, కాస
శ్వాసజ్వరహరః శ్రేష్ఠో లేహః కఫాంతకృత్. 110. కర్షచూ
ర్ణస్య కల్కస్య గుటికానాం చ సర్వశః, ద్రవభుక్త్వా౬స తే
ధవ్యః పాతవ్యశ్చ చతుర్విధః. 111. ఊర్ధ్వజత్రుగ రోగఘ్నీ సే
యం స్యా దవలేహికా, అధోరోగహరీయా తు సా పూర్వం
భోజనాన్తౌ. 112. క్షౌద్రోపకుల్యాసంయోగః కాసశ్వాసజ్వరాప
హః, ప్లీహానం హంతి హిక్కాంచ బాలానాం చ ప్రశస్యతే. 113.
సంసృష్టదోషేషు హితం సంసృష్ట మథ పాచనం.
ఇప్పుడు చాతుర్భద్రావలేహికను చెప్పుచున్నాడు — నేలగుమ్ముడు, పుష్కరమూల ము, కర్కాటకశృంగి, పిప్పళ్లు వీటిని సమభాగముగ చూర్ణమును చేసి తేనెలొకలిపి తినినట్టులయినచో దగ్గు, శ్వాసను, జ్వరము, కఫము వీటిని పోఁగొట్టును. ఇట్లు సిద్ధము చేసిన యవలేహికను సాయంకాలమునందు గ్రహించినయెడల జత్రువునందలి రోగము అనఁగా గొంతుకకు క్రిందిభాగమునఁ బుట్టెడివ్యాధులను కూడ పోగొట్టును. ఈఅవలేహికను భోజనముచేయుటకు ముందుగానే బుచ్చుకొనవలయును. పిప్పళ్లను, తేనెను కలిపినయెడల, దగ్గును, శ్వాసమును, జ్వరమును పోఁగొట్టఁగలుగును. మఱియును ప్లీహను పోఁగొట్టును. వెక్కిళ్ల నణచును. ఇది బాలురకు మిక్కిలి శ్రేష్ఠమైనదియును కూడ నై యున్నయది. గుంపుగా నొకచోటచేరిన దోషములయందు అనఁగా ననేక రోగములు ఒక్కటిగా సంసృష్టములైయున్న విషయములలో మిక్కిలి హితకారి యగును. పాచనమును అనఁగా జీర్ణమునుగూడ చేయుచుండును.
— ౨౦ నవాంగకషాయము. ౨౦ —
శ్లో. విశ్వామృతాబ్ధభూనింబైః పంచమూలీసమన్వితైః 114 క్వథితః
కషాయో హంత్యాశు వాతపిత్తోద్భవం జ్వరం, త్రిఫలా శాల్మలీ
రాస్నా రాజవృక్షాటరూషకైః. 115. శృత మంబు హరేత్తూరం వాతపిత్తో
-త్థం
ఆంధ్రతాత్పర్యసహితము. 21
ధ్వం జ్వరం, కిరాతతిక్తమమృతాం ద్రాక్షా మామలకీం శఠీం. 116.
నిష్క్వాథ్య పిత్తానిలజే క్వాథం తం సగుడం పిబేత్.
శొంఠి, తిప్పతీగె, తుంగముస్తలు, నేలవేము, లఘుపంచమూలములు వీటితో చేసిన క్వాథము వాతపిత్తములవలనఁ బుట్టిన జ్వరమును పోఁగొట్టును. త్రిఫలములు, బూరుగువేరు, సన్నరాస్న, రేలగుజ్జు, అడ్డసరము వీటితోఁ జేయఁబడిన క్వాథము వాతపిత్తజ్వరములను హరించును. తిప్పతీగె, ద్రాక్ష, ఉసిరిక, కచ్చూరము వీటి సమభాగకషాయములో బెల్లమును గలిపి సేవించిన వాతపిత్తజ్వరములు నశించును.
— వాతపిత్తజ్వరాలకు నిదిగ్ధికాదికషాయము; పంచభద్రము; మధుకాదిశీతము. —
శ్లో. నిదిగ్ధికా బలా రాస్నా త్రాయమాణా౭మృతాయుతైః. 117.
మసూరవిదళైః క్వాథో వాతపిత్తజ్వరం జయేత్,
గుడూచీ పర్పటం ముస్తం కిరాతం విశ్వభేషజం. 118.
వాతపిత్తజ్వరే దేయం పంచభద్రమిదం శుభం,
మధుకం శారిబాద్వాద్వే మధుకం చందనోత్పలం. 119.
కాశ్మరీపద్మకం లోధ్రం త్రిఫలాం పద్మకేసరం,
పరూషకం మృణాళం చ న్యసే దుత్తమవారిణి. 120.
మధులాజసితాయుక్తం తత్పీతం ముషితం నిశి,
వాతపిత్తజ్వరం దాహతృష్ణామూర్ఛావమిభ్రమాన్. 121.
శమయే ద్రక్తపిత్తం చ జీమూతానివ మారుతః.
వాకుడు, ముత్తువపులగము, సన్నరాస్న, కలుక్రానుగ, తిప్పతీగె, పిల్లిపెసర, నల్లతెగడ వీటికషాయము వాతపిత్తజ్వరముల నణంచును. తిప్పతీగె, పర్పాటకము, తుంగముస్తలు, విడంగాలు, శొంఠి వీటితోఁజేయఁబడిన కషాయమునకు పంచభద్ర మని పేరు. ఇది వాతపిత్తజ్వరములకు శ్రేష్ఠము. యష్టిమధుకము, తిప్పతీగ, సుగంధపాలవేళ్లు; (నల్లవి, తెల్లవి) ద్రాక్ష, విప్పపూవు, ఎఱ్ఱచందనము, నలుకలువ, గుమ్ముడు, పద్మకములు, లొద్దుగ, త్రిఫలములు, కమలముల కింజల్కములు, చిట్టితపండ్లు, తామరతూడు వీటిని నిర్మలమైన నీటిలో వైచి రాత్రియంతయును నానవైచి దానిలో పర్పాటకము, పేలపిండి, చక్కెర కలిపి త్రాగవలయును. ఇది వాతపిత్తజ్వరమును, విదాహము, మూర్ఛ, పడిపోవుట మొదలగురోగములను, గాలి మేఘములనువలె రక్తపిత్తజ్వరములను గూడ నశింపజేయును.
— పిత్తశ్లేష్మములకుఁ బటోలాదిగణము; గుడూచ్యాదిగణము. —
శ్లో. పటోలం చందనం మూర్వా తిక్తా పాఠా మృతా గణః. 122.
పిత్తశ్లేష్మారుచిచ్ఛర్ది జ్వరకండువిషాపహః, గుడూచీ
22 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
నింబధాన్యాకం పద్మకం చందనాని చ. 123. ఏష సర్వజ్వరాన్ హంతి గుడూచ్యాదిస్తు దీపనః, హృల్లాసారోచకచ్ఛర్ది పిపాసాదా- హనాశనః. 124.
చేదుపొట్ల, ఎఱ్ఱగంధము, చాగ, కటుకరోహిణి, విషబొద్ది, తిప్పతీగె, ఈవస్తు- వులు పటోలాది గణ మనఁబడును. ఇయ్యది పిత్తము, కఫము, అరుచి, ఛర్ది, జ్వరము, దుఱద, విషము మొదలగువానిని పోఁగొట్టును. తిప్పతీగె. నిమ్మకాయ, ధనియాలు, పద్మ- కములు, రక్తచందనము అను వీటిని గుడూచ్యాది గణమని యనియెదరు. ఇది అన్నివిధ- ములగు జ్వరములను పోఁగొట్టును. ఆకలిని పుట్టించును. ఎప్పుడును అతిగా ఉమ్మివే- యుట, పదార్థములపైని యసహ్యత, ఛర్ది, నీటియం దిచ్ఛ, విదాహము వీటిని బోం- గొట్టును.
శ్లో. కిరాతం నాగరం ముస్తం గుడూచించ కఫాధికే, పాఠోదీచ్యామృతా లైస్తు సహ పిత్తాధికే పిబేత్. 125
నేలవేము, శొంఠి, తుంగముస్తలు, తిప్పతీగె, వీటిని కఫ మెక్కువగా నుండిన జ్వరమునం దుపయోగింపవలయును. విషబొద్ది, కురువేరు, తామర అను వానిని పిత్తాధి- క్యమువలన సంభవించెడు జ్వరములయం దుపయోగింపవలయును.
☛ కంటకార్యాదివర్గము; వాసాకషాయము; పటోలాదికషాయము. ☚
శ్లో. కంటకార్యమృతా భార్ఙ్గీ నాగరేంద్రయవాసకం, భూనింబం చందనం ముస్తం పటోలం కటురోహిణీ. 126. కషాయం పాయయే- దేత త్పిత్తశ్లేష్మజ్వరాపహం, దాహతృష్ణా రుచిచ్ఛర్ది కాసహృత్పా- ర్శ్వశూల నుత్. 127. సపత్రపుష్పవాసాయాం రసః క్షౌద్రసితా- యుతః, కఫపిత్తజ్వరం హంతి సాస్రపిత్తం సకామలం. 128. పటో- లం పిచుమర్దశ్చ త్రిఫలా మధుకం బలా, సాధితో౬యం కషా- య స్స్యా త్పిత్తశ్లేష్మోద్భవే జ్వరే. 129.
వాకుడు, తిప్పతీగె, గంటుభారంగి, శొంఠి, కొడిసెపాలవిత్తులు, దూలగొండి, నేలవేము, రక్తచందనము, తుంగముస్తలు, చేదుపొట్ల, కటుకరోహిణి వీటిని సమభాగ- ముగా కషాయముగా గాచి త్రాగించినయెడల పైత్యాధిక్యమువలనగాని, శ్లేష్మమువలన గాని వచ్చిన జ్వరములను వెంటనే యణఁచివేయును. దాహము, నీటినిత్రాగునిచ్ఛ, దప్పి, అరుచి, వాంతి, కాసము, రొమ్మునొప్పి, పార్శ్వపునొప్పి ఈ మొదలగువానినిగూడ నశింపఁజేయఁగలదు. ఇదియే కంటకార్యాది వర్గము అనఁబడు.