चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
156 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.
త్రిదోషనుత్, 19. ఉరోవిబంధం తమకం గళగ్రహం సకాసహిక్కా-
రుచియక్ష్మపీనసమ్, గ్రహణ్యతీసార భగందరార్బుదం ప్రమేహగుల్మాం-
శ్చ నిహంతి సజ్వరాన్. 20.
లవంగములు, తక్కోలములు, వట్టివేళ్లు, రక్తచందనము, నల్లగల్వలు, జీలకఱ్ఱ, ఏలకులు, నల్లజీలకఱ్ఱ, అగరు, దాల్చెనపట్ట, నాగకేసరములు, జటామాంసి, పిప్పళ్లు, శొంఠి, తుంగముస్తలు, నాగకేసరములు, జాజికాయ, కుంకుమపువ్వు, తవక్షీరి వీని నన్నింటిని సమానభాగములుగా తీసికొనవలయును. ఇందులొ కలకండను ఎనిమిదిభాగములు చేర్చి అన్నిటినిచూర్ణము చేయవలయును. ఈచూర్ణము రుచిని పుట్టించును. తృప్తిన్ గలిగించును. ఆకలిని పుట్టించును. బలము నిచ్చును. వీర్యమును వృద్ధినొందించును. మఱియును త్రిదోషములను నశింపఁజేయును. ఱొమ్మునొప్పి తమకము శ్వాసము గళగ్రహము దగ్గు వెక్కిళ్లు అరుచి క్షయరోగము పీనస గ్రహణి అతిసారము భగంధరోగము అర్బుదరోగము మేహరోగము గుల్మవ్యాధులు జ్వరము మున్నగువానిని నశింపఁజేయును. ఇయ్యదియే లవంగాద్యచూర్ణమని చెప్పఁబడును.
తాడీశచూర్ణము.
శ్లో. తాలీసపత్రం మరిచం నాగరం పిప్పలీ శుభా, యథోత్త-
రం భాగవృద్ధ్యా త్వగేలే చార్ధభాగికే. 21. పిప్పల్యష్టగుణా చాత్ర ప్ర-
దేయా సితశర్కరా, శ్వాసకాసారుచిహరం తచ్చూర్ణం దీపనం పరమ్.
22. హృత్పాండు గ్రహణీరోగ ప్లీహాశోషజ్వరాపహం, ఛర్ద్యతీసారశూ-
లఘ్నం మూఢవాతానులోమనం. 23. కల్పయేద్గుటికాం చైత చ్చూర్ణం
పక్త్వా సితోపలం, గుటికాహ్యగ్నిసంయోగా చ్చూర్ణా ల్లఘుతరా స్మృ-
తాః. 24. పైత్తికే గ్రాహ్యం త్వేకే శుభయా వంశలోచనమ్.
తాదీశపత్రి ఒక భాగము, మిరియములు 2 భాగములు, శొంఠి 3 భాగములు, పిప్పళ్లు నాలుగు భాగములు, తవక్షీరి 5 భాగములు, ఏలకులు దాల్చెనపట్ట అర్ధ అర్ధభాగము, పిప్పళ్లు 8 భాగములు మఱియు నిందులొ తగినట్లు తెల్లచక్కెర కలిపి చూర్ణము చేయవలయును. ఈచూర్ణము శ్వాసము దగ్గు అరుచి వీటిని హరించును. చక్కగా జఠరాగ్నిని దీపింపఁజేయును. హృద్రోగము పాండురోగము గ్రహణి పీనసరోగము శోషజ్వరములను పోఁగొట్టును. మఱియును ఛర్ది అతిసారము శూల వీనినిగూడ హరించును. మూఢవాతము ననుకూలముగా త్రిప్పును. కలకండను పాకముచేసి దానిలో నీచూర్ణమును కలిపి మాత్రలను కట్టవలయును. ఈమాత్రలు నిప్పు సెగ చూపినందువలన
ఆంధ్రతాత్పర్యసహితము. 157
చూర్ణముకంటెను తేలికవి యగుచున్నవి. అనేకులు వైద్యులు పిత్తమువలనఁ బుట్టిన క్షయరోగములలో నీచూర్ణమును వాడియున్నారు. మూలమునందు శుభయా అని చెప్పినందున వంశలోచన అని అర్థము చేసికొనవలయును. ఇయ్యదియే తాడిశచూర్ణ మనఁబడును.
వింధ్యవాసియోగము.
శ్లో. శృఙ్గార్జునాశ్వగంధా నాగబలా పుష్కరాభయా ఛిన్నరుహాః, తాలీసాదిసమేతాః లేహ్యా మధుసర్పిర్భ్యాం యక్ష్మహరాః. 25.
మధుతాప్య విడంగాశ్చ జతులోహా ఘృతాభయాః, ఘ్నంతి యక్ష్మాణమత్యుగ్రం సేవ్యమానా హితాశినా. 26. వ్యోషం శతావరీ త్రీణి ఫలాని ద్వే బలే తథా, సర్వామయహరో యోగః సోయం లోహగజోన్వితః. 27. ఏష వక్షఃక్షతం హంతి కంఠజాం శ్చ గదాం స్తథా, రాజయక్ష్మాణ మత్యుగ్రం బాహుస్తంభ మథార్దితం. 28.
కర్కాటకశృంగి, మద్దిపట్ట, పెన్నేరుగడ్డ, నాగబల, పుష్కరమూలము, కరక్కాయ, తిప్పతీగె, తాడిశపత్రి, మిరియాలు, శొంఠి, పిప్పళ్లు, తవక్షీరి, దాల్చెనచెక్క, ఏలకులు వీనినిచేర్చి చూర్ణించి కలిపి ఈయౌషధులయందు ముందు చెప్పిన తాడిశపత్రీ చూర్ణముతోచేసిన ఔషధినికలిపి తేనె, నేయినికూడ నందు చేర్చి భక్షించినచో క్షయరోగములు నశించి పోగలవు. తేనె, వాయువిడంగములు, శిలాజిత్తు, లోహభస్మము, నేయి, కరకకాయ వీటిని లేహముచేసి భక్షించుచు హితకరముగా భోజనమును చేయవలయును. ఇట్లు చేసినయెడల అతిభయంకరము లైన క్షయరోగములను కూడ నశింపఁజేయును. శొంఠి, మిరియములు, పిప్పళ్లు, పిల్లిపీచర [దీనినే కొందఱు చల్లగడ్డ యందురు.] త్రిఫలములు నాగబల ముత్తవపులగము లోహభస్మము వీటితో చేయఁబడు యోగము అన్నివిధములైన రోగములను హరింపఁజేయును. ఇయ్యది రొమ్మునొప్పి గొంతుసంబంధము లగు నన్నిరోగములను పోఁగొట్టును. మఱియును మిక్కిలి భయంకరము లగు క్షయరోగములను చచ్చులను అర్దిత మను రోగమును హరించును. ఇయ్యది వింధ్యవాసియోగ మనఁబడును. దీనినే కొందఱు శృఙ్గార్జునాది యోగ మందురఁట.
రసేంద్రగుటిక.
శ్లో. కర్షః శుద్ధరసేంద్రస్య స్వరసేన జయార్ద్రయోః, శిలాయాం ఖల్వయే త్తావ ద్యావ త్పిండం ఘనం తతః. 29. జలకర్ణా కాకమాచీ రసాభ్యాం భావయే త్పునః, సౌగంధికఫలం భృంగస్వరసేన
158 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.
విభావితం. 30. చూర్ణితం రససంయుక్త మజాక్షీర పలద్వయే, ఖల్వితం ఘనపిండం తు గుటీః స్విన్నకలాయవత్. 31. కృత్వా౬ర్చ శివ మభ్యర్చ్య ద్విజాతీ స్వ్రితోష్య చ, జీర్ణాన్ని భక్షయే దేకాం క్షీరమాంసరసాశనః. 32. సర్వరూపం క్షయం కాసం రక్తపిత్త మరోచకం, అపి వైద్యశతై స్త్యక్త మమ్లపిత్తం నియచ్ఛతి. 33.
యథావిధిగా శుద్ధిచేసిన పాదరసము ఒకకర్షము తెచ్చి ఖల్వములో వేసి తక్కిన రసము అల్లపురసముల నందుచేర్చి చక్కఁగా నూరవలయును. బాగుగా ముద్దగట్టు వఱకిట్లు మర్దింపవలెను. చాగమట్టరసమునందు మరల దానిని భావనచేయవలయును. తరువాత ఏలకులు లవంగపట్ట జాపత్రి నాగకేసరములు వీటిని చూర్ణమును ఒకపలమునందు కలిపి గుంటకలగరాకురసమునందు భావన కట్టవలయును. ఆసిమ్మట చూర్ణమును చేసి మేకపాలు రెం డుపలముల తెచ్చి వానితో చక్కఁగా మర్దింపవలయును. గట్టిగానై ఉండకట్టునంతః ఆ కిట్లు మర్దించి సెనగగింజ లంతంత మాత్రలను చేసికొని మొదట నీశ్వరుని పూజించి, బ్రాహ్మణుల సంతోష పెట్టి అన్నము జీర్ణమైన పిమ్మట ఒకమాత్రను తినవలయును. పాలు మాంసపురసమును భుజింపవలయును. ఈమాత్రలు అన్ని విధములగు క్షయ దగ్గు రక్తపిత్తము అరోచకము మున్నగువానిని పండెఱఱబడి వైద్యులు చికిత్సచేసి సాధింపనేరక వదలివైచిన ఆమ్లపిత్తములను తొలగించును. ఇయ్యది రసేంద్రగుటిక యనఁబడును.
ఏలాదిమంథము.
శ్లో. ఏలాజమోదామలకాభయాక్ష గాయత్రినింబశ్వనశాలసారాన్, విడంగభల్లాతకచిత్రకాం శ్చ కిటుత్రి కాంభోదసురాష్ట్రీకాశ్య. 34. పక్త్వా జలే తేన పచేత్తు సర్పి స్తస్మి న్సుసిద్ధే త్వవతారితే చ, త్రింశత్పలా న్యత్ర సితోపలాయా దద్యాత్తు గోక్షీరపలాని షట్చ. 35. ప్రస్థే ఘృతస్య ద్విగుణం చ దద్యాత్ క్షౌద్రం తతో మంథహతం నిదధ్యాత్, పలం పలం ప్రాత రతో లిహే చ్చ పశ్చాత్పిబేత్ క్షీరమతంద్రిత శ్చ. 36. ఏత ద్ధి మేధ్యం పరమం పవిత్రం చక్షుష్య మాయుష్య తమం తథైవ, యక్ష్మాణ మాశు వ్యపహంతి శూలం పాండ్వామయం చాపి భగందరం చ. 37. న చాత్ర కించి త్పరివర్జనీయం రసాయనం చైత దుపాస్యమానం.
ఆంధ్రతాత్పర్యసహితము. 159
ఏలకులు, వామము, ఉసిరిక, కరక, తాడి, చంద్రచెక్క, వేపచేవ, వేగిసచేవ, మద్దిచేవ వీటియొక్కరసమున్ను, వాయువిడంగములు, జీడివిత్తనములు, చిత్రమూలము, శొంతి, మిరియములు, పిప్పళ్లు, తుంగముస్తలు, తొవరిమన్ను వీనిన్నిటి కషాయము చేసి ఆకషాయమునందు నేతిని పోసి పక్వముచేసి నేయి పరిశుద్ధముగా సిద్ధమైనప్పుడు పొయినుండి దింపి 30 పలముల కలకండసందులో చేర్చి 6 పలముల తవక్షీరిని కూడ నందు వేయవలయును. 16 పలముల ప్రమాణములో కాచునట్లు తేనెను కలిపి పిష్టుకవ్వముతో చిలకవలయును. ఇట్లు సిద్ధముచేసిన ఈయౌషధమును ప్రాతఃకాలములలో లేచి పలము చొప్పున సేవింపవలయును. తరువాత మెల్లగా పాలనుకూడ త్రాగుచుండవలయును. ఈమంథము పరిశుద్ధమైనదియును మిగుల పవిత్రమైనదియు నై యున్నయది. ఇది నేత్రములకు దివ్యామృతము. ఆయుష్యమును పెంపొందించును. క్షయరోగమును శూలరోగమును పాండురోగమును తత్ క్షణమే నశింపఁజేయును. భగందరరోగములఁ గూడ నపహరించును. ఈమంథములో పరిహరింపఁదగిన (అనగా పారవేయఁదగు) పదార్థ మేదియును లేదు. ఈరసాయనము సేవింప తగినది. ఇయ్యది ఏలాదిమంథమను రసాయన మనఁబడును.
—• సర్పిర్గుడము. •—
శ్లో. బలా విదారీ హ్రస్వా చ పంచమూలీ పునర్నవా, పంచానాం క్షీరవృక్షాణాం శుంగా షుష్ట్యంశికాః పృథక్. 38.
ఏషాం కషాయే ద్విక్షీరే ఐదార్యా జరసాంశికే, జీవనీయైః పచే త్కల్కై రక్షమాత్రైః ఘృతాఢకం. 39.
సితాపలాని పూతే చ శీతేద్యాచ్ఛ్రింశ దావపేత్, గోధూమపిప్పలీవంశీ చూర్ణం శృంగాటకస్య చ. 40.
సమాంశికం కౌడవికం తత్సర్వం ఖజనూర్ధితం, స్త్యానం సర్పి ర్గుడా న్కృత్వా భూర్జపత్రేణ వేష్టయేత్. 41.
తా న్భక్ష్యా న్గులికాన్ క్షీరం మద్యం చాను పిబే త్కృశే, శోషే కాసే క్షతక్షీణే శ్రమస్త్రీభారకర్శితే. 42.
రక్త నిష్ఠీవనే తాపే పీనసే చోరసి స్థితే, శస్తాః పార్శ్వశిరశ్శూలే భేదే చ స్వరవర్ణయోః. 43.
క్వాథ్యే త్రయోదశపలే ద్రవ్యాల్పత్వభయాజ్జలం, అష్టగుణం క్వాథసమో విదార్యాజరసౌ పృథక్. 44.
కేచి ద్యథోక్తక్వాథ్యే తు క్వాథం ఘృతసమం జగుః.
ముత్తవపులగము నేలగుమ్ముడు లఘుపంచమూలములు శొంతి గల్లేరు క్షీరవృక్షపంచకము, అనఁగా జువ్వి మఱ్ఱి రావి మేడిదిరిసెన వీటిచిగుటాకులు మొగ్గలు వీటిని ఒక్కొక్క
160
చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.
టియనొక్కొక్క పిడికెడు చొప్పున వేఱువేఱుగా తీసికొనవలయును. పిమ్మట వీనిని కషాయము పెట్టి యాకషాయమునందు రెండురెట్ల పాలుకలిపి నేలగుమ్ముడుయొక్కయు మేకమాంసముయొక్కయు రసమును కలిపి దానియందు మేద మహామేద కాకోలి మొదలగువానిని ఒక్కొక్కకర్షము చొ॥ తీసికొని కల్కము చేసి కలిపి 64 పలముల నేతిని అందుపక్వము చేయవలయును. చక్కగా పక్వమైనపిమ్మట దించి చల్లార్చి వడియకట్టి అందులో 32 పలముల కలకండను కలిపి తరువాత గోధుమలు పిప్పళ్లు తవక్షీరి వీటిని చూర్ణమును చేసి ఆచూర్ణమును తేనెను 14 పలములచొప్పున కలపవలయును. తరువాత వీని నన్నింటిని చక్కగా చిలికి ఒక్కొక్క-పల మంత కుడుములను చేసి భుజపత్రపుటాలలో చుట్టి పెట్టవలయును. ఇట్టి కుడుములలో నొక్కొక్కటి చొప్పున ప్రతిదినమును తిని ఆమీదట పాలను గాని మద్యమును గాని త్రాగుచుండవలయును. కఫరోగమునందును శోషము అనగా క్షయయందును క్షతక్షీణములయందును పరిశ్రమలు బరువుమోయుట స్త్రీసంగమము ఇట్టివానిచేత నాకర్షింపబడిన వానియందును రక్తచ్ఛర్దులలోను జ్వరమునందును పీనసయందును ఎదురురొమ్ములోని శూలలయందును పార్శ్వపునొప్పులవిషయమునను తలనొప్పియందును స్వరభేదము మాటలమార్పు మున్నగువానియందును ఈకుడుములు లత్యుత్తమముగా గుణము నిచ్చు నని చెప్పంబడినవి. పదమూఁడుపలముల కషాయపు వస్తువులు స్వల్పమగునేమొ? యనుశంక యున్నచో వీటి నెన్నిదిరెట్లుగా గ్రహింప వలయును. కషాయముతో సమముగా నేలగుమ్ముడు రసమును మేకమాంసపు రసమును వేరు వేరుగా తీసికొనవలయును. కొందఱు వైద్యులు పైచెప్పిన కషాయవస్తువులలో నేతితో సమముగా కషాయముగూడ నుండవలయు నని చెప్పిరి.
❧ చ్యవనప్రాశము. ❧
శ్లో. బిల్వాగ్నిమంథస్యోనాక కాశ్మర్యః పాటలీ బలా. 45.
పర్ణ్య శ్చతస్రః పిప్పల్యః శ్వదంష్ట్రా బృహతీద్వయం, శృంగీతామలకీ ద్రాక్షా జీవంతీ పుష్కరాగురు. 46.
అభయా సామృతా బుద్ధిర్జీవకర్షభకౌ శఠీ, ముస్తం పునర్నవా మేదా సూక్ష్మై లోత్పలచందనే. 47.
విదారీ వృషమూలాని కాకోలీ కాకనాసికా, ఏషాం పలోన్మితా న్భాగాన్ శతాన్యామలకస్య చ. 48.
పంచ దద్యా త్త దైకథ్యం జలద్రోణే విపాచయేత్, జ్ఞాత్వా గతరసా న్యేతా న్యాషధా న్యాథ తం రసం. 49.
త చ్చామలక ముద్ధృత్య నిష్కులం తైలసర్పిషోః.
ఆంధ్రతాత్పర్యసహితము. 161
పలద్వాదశకే భృష్ట్వా దత్త్వా చార్థతులాం భిషక్. 50. మత్స్యండీ కాయాః పూతాయాః లేహవ త్సాధు సాధయేత్, షట్పలం మధున శ్చాత్ర సిద్ధశీతే ప్రదాపయేత్. 51. చతుష్పలం తు గోక్షీర్యాః పిప్ప ల్యా ద్విపలే తథా, పల మేకం నిదధ్యా చ్చ త్వగేలాపత్ర కేసరాత్. 52. ఇత్యయం చ్యవనప్రాశః పర ముక్తో రసాయనః, కాసశ్వాసహర శ్చైవ విశేషేణోపదిశ్యతే. 53. క్షీణక్షతానాం వృద్ధానాం బాలా నాం చాంగవర్ధనమ్, స్వరక్షయ మురోరోగం హృద్రోగం వాతశోణి తమ్. 54. పిపాసాం మూత్రశుక్రస్థాన్ దోషాం శ్చై వాపకర్షతి, అస్య మాత్రాం ప్రయుంజీత యో పరుంధ్యా న్నభోజనం. 55. అస్య ప్రయో గా చ్చ్యవనః సువృద్ధో భూ త్పున ర్యువా, మేధాం స్మృతిం కాంతి మనామయత్త్వం వపుఃప్రకర్షం బల మింద్రియాణాం, స్త్రీషు ప్రహర్షం పర మగ్నివృద్ధిం వర్ణప్రసాదం పవనానులోమ్యం. 56. రసాయన స్యాస్య నరః ప్రయోగా-ల్లభేత జీర్ణోఽపి కుటీప్రవేశాత్, జరాకృతం పూర్వ మపాస్య రూపం బిభర్తి రూపం నవయౌవనానాం. 57. సితామత్స్యండి కాలాభే ధాత్ర్యాశ్చ మృదుభర్జనం, చతుర్భాగజలే ప్రాయః ద్రవ్యం గతరసం పిబేత్. 58.
బిల్వము కూరనెల్లి పొదిరివేళ్లు నేలగుమ్ముడు చిట్టాముట్టి కారుమినుము కా రుపెసర కొలపొన్న ముయ్యాకుపొన్న పిప్పళ్లు పల్లేరు వాకుడు పెద్దములక కర్కాటకశృంగి నేలయుసిరిక ద్రాక్ష మనుబాల పుష్కరమూలము అగరు కరకకాయ తిప్పతీగె బుద్ధి జీవక మను ద్రవ్యము ఋషభక మను గంధద్రవ్యము కచ్చూరము తుంగముస్తెలు శొంఠి మేద చిన్నవిలకులు గలిజేరు నల్లకలువ చందనము నేలగుమ్ముడు అతివస కాకోలి కాకిదొండ వీనినన్నింటిని ఒక్కొక్కపలముగా తీసికొనివచ్చి ఉసిరిక 100 పలములను తీసికొనవలయును. అన్నింటిని కలిపి ద్రోణపునీరుబోసి చక్కగా వండ వలయును. అందలి రస మంతయు నౌషధములకు నిశ్శేషముగా పట్టిన తరువాత ఆరస మును ఉసిరికకాయలను తీసి పొట్టుతీసి తైలము నెయ్యి 12 పలములు తెచ్చి దానిలో వేసి వేయించి ఆపిమ్మట చక్కగా నన్నింటిని కలియఁబెట్టి లేహమువలె సిద్ధము చేయ వలయును. ఇట్లుచేసిన దీనిలో 6 పలముల తేనెను చల్లారినపిమ్మట వేసి తవక్షీరిని నాలుగు పలములు, పిప్పళ్లు 2 పలములు లవంగపుపట్ట విలకులు జాపుత్రీ నాగకేసరములు ఇవి అన్నియును ఒక్కొక్కపలము చొప్పునను వేయవలయును. ఇట్లు చేయఁబడినరసాయ
21
162 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.
నమును చ్యవనప్రాశమని యందురు. ఇయ్యది విశేషముగా దగ్గులను శ్వాసరోగములను పోగొట్టును. బల ముడిగినవారలు, ముససళ్ళు, పసిపిల్లలు వీరికి అవయవములకు బలము నిచ్చును. స్వరక్షయము బొమ్మునొప్పి కడుపునొప్పి వాతరక్తము దాహము మూత్రదోషము వీర్యదోషము వీనినిపోగొట్టును. ఈయౌషధమును సేవించునప్పుడు అన్నమునునిల్పుదల చేయరాదు. దీనిని సేవించుటచేత ముదుసలియైన చ్యవనమహాముని ప్రాయపువాఁడయ్యెను. ఇయ్యది బుద్ధిని, జ్ఞాపకశక్తిని, కాంతిని, ఆరోగ్యమును, దేహమునకు లాఘవమును, ఇంద్రియనులకు బలమును, సంతోషమును, అగ్నివృద్ధిని, చక్కని కాంతినిచ్చి వాయువుయొక్క క్రిందుమీదులను పోగొట్టి వృద్ధిపొందించును. ఈరసాయనమును సేవించుటచేత ముసలినాఁడును యౌవనమునొందును. కాని కుటీప్రవేశము మాత్ర మవశ్యకార్యము. మఱియును ముసలితనము గల తనపూర్వపురూపును తొలగించుకొని క్రొత్తదియగు యౌవనరూపమును ధరింపఁగలుగును. ఈరసాయములోనికి అనుపానము అగు చెఱకుపాకు దొరకనియెడల చక్కెరను వేసికొనవలయును. మఱియును లేతయుసిరికలను వేయించి వేయవలయును. మఱియును సామాన్యముగా నాల్గవభాగము నీటిలో వస్తువులరసము చేరుచున్నది. ఇయ్యదియే చ్యవనప్రాశ మనఁబడును.
జీవంత్యాదిఘృతము.
శ్లో. జీవంతీం మధుకం ద్రాక్షాం ఫలాని కుటజస్య చ, శఠీ పుష్కరమూలం చ వ్యాఘ్రీం గోక్షురకం బలాం. 59.
నీలోత్పలం తామలకీం త్రాయమాణాం దురాలభాం, పిప్పలీం చ సమం పిష్ట్వా ఘృతం వైద్యో విపాచయేత్. 60.
ఏత ద్వ్యాధిసమూహస్య రోగేశస్య సముత్థితం, రూప మేకాదశవిధం సర్పి రగ్ర్యం వ్యపోహతి. 61.
పాలకూర యష్టిమధుకము ద్రాక్ష కొడిసెపండ్లు కచ్చూరము పుష్కరమూలము నేలములక పల్లేరు చిట్టాముట్టి నల్లకల్వలు నేలయుసిరిక అగరుశాంతి దులదగొండి లేక తిటకసిండ పిప్పళ్ళు ఇవి యన్నియు సమానభాగములుగా తెచ్చి వానియందు నేయిపోసి పక్వము చేయవలయును. ఇయ్యది శ్రేష్ఠమైన ఘృతము. రోగముల గుంపుల నన్నిటిని నశింపఁజేయును. పదునొకండు తెఱఁగులగు క్షయరోగములను కూడ నీజీవంత్యాదిఘృతము నాశనము నొందించును. ఇయ్యది జీవంత్యాదిఘృత మనంబడును.
పిప్పలీఘృతము.
శ్లో. పిప్పలీగుడసంసిద్ధం ఛాగక్షీరయుతం ఘృతం,
ఏత దగ్నివివృద్ధ్యర్థం సర్పి శ్చ క్షయకాసినాం. 62.
ఆంధ్రతాత్పర్యసహితము. 163
పిప్పళ్ళు బెల్లము మేకపాలు వీటితో పక్వము చేయంబడిన నేయి క్షయ దగ్గు కలవారలకు జఠరాగ్ని నుద్దీపింపఁజేయును. ఇయ్యది పిప్పలీఘృతము.
-ః పారాశరఘృతము. ః-
శ్లో. యష్టీ బలా గుడూ చ్యల్పపంచమూలీ తులాం పచేత్,
శూర్పే ౨పా మష్టభాగస్థే తత్ర పాత్రం పచేద్ఘృతం. 63. ధాత్రీవి
దారీస్వరసే త్రిపాత్రే పయసోర్మణే, సుసిద్ధే ర్జీవసోద్యైశ్చ పారాశర మిదం
ఘృతం. 64. ససైన్యం రాజయక్ష్మాణా మున్మూలయతి శీలితం,
యష్టిమధుకము ముత్తవపులగము తిప్పతీగె లఘుపంచమూలములు వీటినిఅన్నిటిని కలిపి తులాప్రమాణము తెచ్చి రెండుద్రోణముల నీటిలొ వేసి పక్వము చేయుచు నెనిమిదవ పాలు నీరు మిగు లుండగా 64 పలముల నేతి నందులొ బోసి పక్వము చేయవలయును. ఈఘృతము సేనలతో కూడి దండెత్తివచ్చిన రాజయక్ష్మల నైనను (అనఁగా పరివారవ్యాధులతోఁగూడిన క్షయము నైనను) మొదలంటునట్లు నశింపజేయును. ఇయ్యది పారాశరఘృత మనఁబడును.
-ః ఛాగలాద్యఘృతము. ః-
శ్లో. ఛాగమాంసతులాం గృహ్య సాధయే ల్లవణేంభసి. 65. పా
దశేషేణ తేనైవ ఘృతప్రస్థం విపాచయేత్, ఋద్ధివృద్ధి చ మేదే ద్వే
జీవకర్షభకౌ తథా. 66. కాకోలీ క్షీరకాకోలీ కల్కైః పృథక్పలోని తైః,
సమ్యక్సిద్ధే త్వవతార్య శీతేతస్మి న్వి ధాపయేత్. 67. శర్కరాయాః
పలా న్యష్టౌ మధునః కుడపం క్షిపేత్, పలం పలం పిబే త్ప్రాతః య
క్ష్మాణం హంతి దుర్జయం. 68. క్షతక్షయం చ కాసం చ పార్శ్వశూల
మరోచకం, స్వరక్షయ మురోరోగం శ్వాసం హన్యాత్సుదారుణం. 69.
మేకమాంసము తులాప్రమాణమును తెచ్చి ద్రోణపు నీటిలొ వైచి పక్వము చేయవలయును. నాల్గవభాగము నీరు బాకియుండగా 16 పలముల నేతిని గూడ చేర్చి వండవలయును. కాని పక్వము అగుసమయమునందు ఋద్ధి వృద్ధి మేద మహమేదము తిప్పతీగ ఋషభమను గంధద్రవ్యము కాకోలి క్షీరకాకోలి వీటినన్నిఁటిని వేరు వేరుగా కల్కము చేసి ఒక్కొక్కపలము చొప్పున తీసికొనవలయును. ఇయ్యది దుర్జయ మగు రాజయక్ష్మను పోగొట్టును. క్షతక్షయము కాసము పార్శ్వశూలము అరోచకము స్వరక్షయము ఉదరరోగము శ్వాసము వీనిని పోగొట్టగల్గును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 165
మను సిద్ధము చేయవలసినది. ఈఘృతము అన్ని విధములగు అభిఘాతములవలనఁ బుట్టిన క్షయరోగములు శూల క్షతక్షయము మఱియును భయంకర మగు దగ్గ వీటిని నశింపఁ జేయును.
నాగబలాఘృతము.
శ్లో. పాదశేషే జలద్రోణే పచే న్నా గబలా తులామ్, తేన
క్వాథేన తుల్యాంశం ఘృతం క్షీరం చ సాధయేత్. 75.
పలార్ధికై శ్చాతిబలా బలాయష్టిపునర్నవా, ప్రపౌండరీక కాశ్మర్యప్రియా లకపి
కచ్ఛుభిః. 76.
అశ్వగంధాసితాభిరు మేదాయుగ్మ త్రికంటకైః, మృణా
లవిషశాలూకశృంగాటక కశేరుకైః. 77.
ఏత న్నా గబలా సర్పి రక్తపి త్తక్షతక్షయం, హంతి దాహం భ్రమం తృష్ణాం బలపుష్టికరం పరం. 78.
బల్యా మాజస్య మాయుష్యం వలీపలితనాశనం, ఉపయుంజీత షణ్మా
సా న్వృద్ధోఽపి తరుణాయతే. 79.
ద్రోణపరిమాణములనీటిని ప్రొయిమీఁదఁ బెట్టి 64 పలములుగా దిగఁగాచి నూరు పలముల జిబిలికను పక్వము చేయవలయును. ఈక సాయ మన్ని పాళ్లను దానితో సమానముగా కలిపి అంతే నేతిని కూడను కలిపి పక్వము చేయవలయును. తరువాత అతిబల ముత్తవపులగము యష్టిమధుకము గజ్జేరు కమలము నేలగుమ్ముడు పాలచెట్టు దురదగొండి పల్లేరు వంశలోచనము పిల్లిపిచ్చర లేక చల్లగడ్డ రెండుతెఱగులగు మేదలు పల్లేరు వట్టివేళ్ళు మృణాళము కమలపుగడ్డ గొట్టిపువ్వు తుంగముస్తెలు అను వీటి నన్నింటిని అర్థపలము చొప్పున వేసి పక్వము చేయవలయును. ఇది నాగబలాఘృత మనంబడును. ఇయ్యది రక్తపిత్తములను క్షతక్షయరోగములను పోగొట్టును. దాహము భ్రమ దప్పలు కూడ నశింపఁజేయును. బలము నిచ్చును. తేజస్సు నిచ్చును. ఆయుష్యమును పెంచును. ముడుతలు నెఱియుట వీటిని పోగొట్టును. ఇద్దానిని ఆరుమాసములు సేవింపవలయును. ఈయౌషధ సేవవలన ముదుసలికూడ ప్రాయపువాఁడు అగును.
నిర్గుండీఘృతము.
శ్లో. సమూలఫలపత్రాయాం నిర్గుండ్యా స్స్వరసైః ఘృతం,
సిద్ధంపీత్వా క్షయక్షీణః నిర్వ్యాధి ర్భాతి దేవవత్. 80.
వేళ్ళు ఆకులు కాయలతో కూడకల వావిలిరసముతో నేతినివండి పుచ్చుకొనినయెడల క్షయరోగముచేత కృశించినమనుజుఁడు దేవునివలెరోగములేనివాడుగా ప్రకాశింప గలుగుచున్నాడు.
166 చక్రదత్త — ౧౦. రాజయక్ష్మాధికారము.
బలాద్యఘృతము.
శ్లో. బలాశ్వదంష్ట్రా బృహతీ కలశీ ధావనీ స్థిరాం, నింబం పర్పటకం ముస్తం త్రాయమాణాం దురాలభాం. 81.
కృత్వా కషాయం పేష్యాద్ధం దద్యా త్త్వామలకీం శఠీం, ద్రాక్షాం పుష్కరమూలం చ మేదా మామలకాని చ. 82.
ఘృతం పయశ్చ తత్సిద్ధం సర్పి ర్జ్వరహరం పరం, క్షయకాసప్రశమనం శిరఃపార్శ్వరుజాపహం. 83.
చరకోదిత వాసాద్యఘృతానంతర ముక్తిః, వదంతీ హ ఘృతా త్క్వాథం పయశ్చ ద్విగుణం పృథక్. 84.
ముత్తువపులగము, పల్లేరు, పెద్దములక, కొలపొన్న, నక్కతోకపొన్న, ముయ్యాకుపొన్న, వాకుడు, రేలచెక్క, పర్పాటకము, తుంగముస్తెలు, కలుగ్రానుగ, చిన్నదూలగొండి వీటిని కషాయమును బెట్టికొని ఉసిరిక, కచోరము, ద్రాక్ష, పుష్కరమూలము, మేద, ఉసిరిక కాయలు, నేయి, పాలు చేర్చి పక్వము చేయవలయును. ఇట్లు సిద్ధము చేసిన ఘృతము జ్వరములను పోఁగొట్టును. క్షయ దగ్గులను తగ్గించును. తలనొప్పి పార్శ్వపునొప్పి వీని నపహరించును. ఇయ్యది చరకఋషిచే చెప్పఁబడిన వాసాద్యఘృతము తరువాత చెప్పుటచేత కొందఱు నేతికంటెను కషాయమును పాలును రెండురెట్లుగా తీసికొనవలయు నని చెప్పెదరు.
చందనాద్యతైలము.
శ్లో. చందనాంబునఖం వాప్యం యష్టీశైలేయపద్మకం, మంజిష్ఠా సరలం దారు శశ్యేలాపూతికేసరం. 85.
పత్రం తైలం మృగామాంసీ తక్కోలం వనితాంబుదం, హరిద్రే శారివే తిక్తా లవంగాగురుకుంకుమం. 86.
త్వగ్రేణునలికా చైభి స్తైలం మస్తు చతుర్గుణం, లాక్షారససమం సిద్ధం గ్రహఘ్నం బలవర్ణకృత్. 87.
అపస్మారజ్వరోన్మాద కృత్యాలక్ష్మీవినాశనం, ఆయుఃపుష్టికరం చైవ వశీకరణ ముత్తమం. 88.
మంచిగంధము కురు వేరు నఖమను గంధద్రవ్యము కోష్ఠు యష్టిమధుకము అడవిసదాప నెమలి అడుగుచెట్టు కమలముమంజిష్ఠము సరళ దేవదారురసము దేవదారుదళము కచ్చూరము విలగలు జవ్వాజి కస్తూరి నాగ కేసరములు శిలాజిత్తు జాపత్రిమురయనుగంధద్రవ్యము జటామాంసితక్కోలపు చెట్టుపసపు మ్రానిపసపు సుగంధిపాల వేళ్ళు కటుకరోహిణి లవంగములు అగురు కుంకుమపూవు లవంగపుపట్ట రేణుక గింజలు నలిక వీటితోటి జేయఁబడినకషాయములో తైలముకంటె నాల్గు రెట్లధికముగా పెరుగుపై నీరు ఇంతేప్రమాణముగా
ఆంధ్ర తాత్పర్యసహితము. 167
లాక్షారసము వీటిని అన్నిటిని కలిపి తైలమును సిద్ధము చేయవలయును. ఈ తైలము గ్రహదోషములను పోగొట్టును. బలమును కాంతిని హెచ్చించును. అపస్మారము జ్వరము పిచ్చి కృత్య అలక్ష్మి మున్నగువానిని నశింపఁజేయును. ఆయుష్యమును బలమును ఇచ్చును. మరియు నిది యుత్తమ మగు వశీకరణము కూడనై యున్నయది.
— బలనాగబలాద్యఘృతము. —
శ్లో. ఛాగం మాంసం పయశ్ఛాగం ఛాగం సర్పిస్సశర్కరం,
ఛాగోపసేవాశయనం ఛాగమధ్యే తు యక్ష్మనుత్. 89.
ఉరో మత్వా క్షతం లాక్షాం పయసా మధుసంయుతాం,
సద్య ఏవ పిబే జీర్ణే పయసాద్యా త్సశర్కరం. 90.
ఇక్ష్వాలికా బిసగ్రంధి పద్మకేసర చందనైః,
శృతం సయోమధుయుతం సంధానార్థం పిబే త్సతీ. 91.
బలాశ్వగంధా శ్రీపర్ణీ బహుపుత్రీ పునగ్నవాః,
పయసా నిత్య మభ్యస్తాః క్షపయంతి క్షతక్షయం. 92.
ఘృతం బలా నాగబలార్జునాంబు సిద్ధం సయష్టీమధుకల్కపాదం,
హృద్రోగ శూల క్షతరక్తపిత్త కాసానిలాసృక్ శమయత్యుదీర్ణం. 93.
మేకమాంసము చక్కెర వేసిన మేకపాలు మేక నేయి మేకలను కాయుట మేకలనడుమను పరుండుట ఇవి యన్నియును క్షయరోగములను పోగొట్టును. ఉరఃక్షతరోగి వెంటనే లాక్షా కషాయమును తేనెతో కలిపి పాలతో త్రాగవలయును. జీర్ణమైనవెనుక పాలతో చక్కెరను కలిపికొని తినవలయును. చెఱకుముక్క తామరతూడు పద్మములలోనికింజల్కము మంచిగంధము వీటితో పాలను కాచి వాటియందు తేనెను వేసికొని ఉరఃక్షతముకై త్రాగవలయును. ముత్తువపులగము, అశ్వగంధ, కొలపొన్న, బేగు, పిల్లిపీచర, తెల్లగలిజేరు వీటితో చేసిన కషాయమునందు యష్టిమధుకముల కల్కము నాల్గవభాగమును కలిపి నేతిని పక్వము చేయవలయును. ఈ ఘృతము హృద్రోగమును, శూలలను, క్షయరోగములను, రక్తపిత్తములను వాతములను వాతరక్తములను వీటిచేత పెంపొందిన ఇతరరోగములను నశింపఁజేయును.
ఇది చక్రదత్తయందు క్షయరోగాధికార ప్రకరణము ముగిసినది.
౧౧. కాసరోగాధికారము.
కాసరోగమునందు సామాన్యోపాయములు.
శ్లో. వాస్తూకో వాయసీశాకం మూలకం సునిషణ్ణకం, స్నేహాస్తైలాదయో భక్ష్యాః క్షీరేక్షురసగౌడికాః. ౧.
దధ్యారనాలామ్లఫలం ప్రసన్నాపాన మేవ చ, శస్యతే వాతకాసేషు స్వాద్వమ్లలవణాని చ. ౨.
గ్రామ్యానూపోదకై శ్శాలియవగోధూమ షష్టికాన్, రసై రాత్మాత్మగుప్తానాం యూషై ర్వా భోజయే ద్ధితాన్. ౩.
పంచమూలీకృతః క్వాథః పిప్పలీచూర్ణసంయుతః, రసాన్న మశ్నతా నిత్యం వాతకాస మపస్యతి. ౪.
చక్రవర్తికూర కామంచికూర ముల్లంగి చెంచలకూర నూనె మొదలగు తైలపదార్థములును, పాలు చెఱకురసము బెల్లపువస్తువులును తినఁదగిన పథ్యపదార్థములు వాతమువలనఁ గలుగు దగ్గుల విషయమై పెరుగు గంజి పులిబచ్చలి మద్యపానము పుల్లనిపదార్థములు మధురపదార్థము ఉప్పువస్తువులు ఉత్తమములగు పథ్యములని చెప్పఁబడినవి. గ్రామములయందలి నీళ్లుతరగని చెరువులుమున్నగు ప్రదేశములలోని యుదకములచేత వరిబియ్యమును యవలను గోధుమలను షష్టిధాన్యములను వండికొని గాని మినుములు దురదగొండి వీనియూషములు గాని పక్వముచేసి భుజింపవలయును. పంచమూలపు కషాయములో పిప్పలి చూర్ణమును వేసికొని త్రాగవలయును. మాంసరసముతో గూడ నన్నమును తినవలయును. ఇట్లు చేసినయెడల వాతమువలన గలిగిన దగ్గు నశించిపోవును.
అపరాజితలేహము.
శ్లో. శృంగీశఠీకణాభార్జీ గుడవాదద యాసకైః, సతైలై ర్వాతకాసఘ్నః లేహోయ మపరాజితః. ౫.
అతివస గంటుకచోరము పిప్పళ్ళు గంటుభారంగి బెల్లము తుంగముస్తెలు తితికనిండతైలము వీటితో లేహమును చేసి సేవించిన వాతరోగములను దగ్గులను పోగొట్టును. ఇయ్యది అపరాజిత మను లేహము.
169 आन्ध्रतात्पर्यसहितमु.
शोंठि; लेहमु मुन्नगुनविनि.
श्लो. चूर्णिता विश्वदुःस्पर्शा शृङ्गी द्राक्षा शठीसिताः, लीढ्वा तैलेन वातोत्थं कासं जयति दारुणम्. 6.
भार्गी द्राक्षा शठी शृङ्गी पिप्पलीविश्वभेषजैः, गुडतैलयुतो लेहः हितो मारुतकासिनाम्. 7.
पित्तकासे तనుకफे त्रिवृतां मधुरैर्युताम्, दद्याद्घनकफे तिक्तैर्विरेकार्थं युतां भिषक्. 8.
मधुरै र्जाङ्गलरसैः श्यामाकयवकोद्रवाः, मुद्गादियूषैः शाकै श्च तिक्तकै र्मात्रया हिताः. 9.
बला द्विबृहती वासा द्राक्षाभिः क्वथितं जलम्, पित्तकासापहं पेयं शर्करामधुयोजितम्. 10.
शरादिपञ्चमूलस्य पिप्पलीद्राक्षयो स्तथा, कषायेण शृतं क्षीरं पिबेत्समधुशर्करम्.
काकोली बृहती मेदा युग्मै स्सवृषनागरैः, पित्तकासे रसक्षीरयूषां श्च प्युपकल्पयेत्. 12.
द्राक्षामलकखर्जूरं पिप्पलीमरिचान्वितम्, पित्तकासापहं ह्येत ल्लिह्या न्मधुकसर्पिषा. 13.
खर्जूर पिप्पली द्राक्षा सितालाजा स्समांशिकाः, मधुसर्पिर्युतो लेहः पित्तकासहरः परः. 14.
शठी पौष्करबृहती शर्कराविश्वभेषजम्, पिष्ट्वा रसं पिबे त्पूतं सघृतं पित्तकासनुत्. 15.
मधुना पद्मबीजानां चूर्णं पैत्तिककासनुत्, बलिनं वमनेनादौ शीलितं कफकासिनम्. 16.
यवान्नैः कटुरूक्षोष्णैः कफघ्नैः कफहृच्च यैः प्युपचरेत्, पिप्पली क्षारकै र्यूषैः कालत्थै र्मूलकस्य च. 17.
लघ्वा न्यन्नानि भुञ्जीत रसै श्चापि कटुकान्वितैः.
शोंठि, यवक्षारमु, अतिवस, द्राक्ष, कच्चूरमु, कलकंड वीट्लनु तैलमुतो लेहमुनुगा चेसि भक्षिंचिन मिगुल भयंकर मैनदैननु वातमुचेఁ बुट्टेडु दग्गु नशिंचुनु. गंटुभारंगि द्राक्ष कच्चूरमु कर्टाटकशृंगि पिप्पळ्लु शोंठि बेल्लमु तैलमु वीटिनि लेहमुनु चेसिकोनि भक्षिंचिन दग्गुगलवारिकि हितकर मगुनु. पैत्यसंबंधमु लगु दग्गुल विषयमुननु कोद्दिगा कफमु पडुवानियंदुनु तीपिपदार्थमुलतो कलिपि तेल्लतेगड नीयवलयुनु. कफमु जास्तिगा वच्चुचुन्न यॆडल कटुपदार्थमुलतोఁगलिपि तेल्लतेगडनु विरेचनमु लगुटकोఱकु इय्यवलयुनु. मधुरमु लगु पदार्थमुलु अडविजंतुवुल मांसरसमु वीटितो कूडनु, चामलु यवलु कॊऱ्रलु మొదలगुवानि नाहारमुगा नेर्पఱुपवलॆनु. मఱियुनु
22
170 चक्रदत्त — ११. कासरोगाधिकारमु.
पेसर (गञ्जि) कट्टुनु चेदुकूरलुनु हितकरमु लगुनु. मुत्तुवुलगमु, चिन्नमुलक, पेद्दमुलक, द्राक्ष, वीटितो कषायमु पेट्टिन नीरु पैत्यरोगमुलनु दग्गुलनु पोगोट्टुनु. इन्दु तेने कलकण्डयुनु चेर्चिकोनवलयुनु. काकिवेण्ड्रु मोदलगु पञ्चमूलमुलयोक्कयु द्राक्षयोक्कयु कषायमुचेत काचिनपालु तेने चक्केरनु कलिपिकोनि त्रागवलयुनु. काकोलि चिन्नमुलक मेद महामेद अड्डसरमु शोंठि द्राक्ष वीटितो काचिन कषायोदकमुलो चक्केर तेनेनु कलिपिकोनि त्रागिनयेडल पित्तसम्बन्धमु लगु दग्गुलु नशिञ्चुनु. द्राक्ष उसिरिक खर्जूरफलमु पिप्पळ्लु मिरियमुलु वीटिनि चूर्णमुनुचेसिfileTEन्दु तेनेनु नेतिनि कलिपिकोनि सेविञ्चिन पैत्यपुदग्गुलु तग्गुनु. खर्जूरमु, लेक पिप्पळ्लु, द्राक्ष, कलकण्ड, एलालु वीटिनि समानभागमुलनुचेर्चि तेनेलोनु नेतिलोनुकलिपिकोनि सेविञ्चिनयेडल पित्तसम्बन्धमुलगु दग्गुलनु तग्गिञ्चुनु. कम्मारमु करुवेरु नेलमुलक कलकण्ड शोंठि वीटिरसमुनु तीसि वडियकट्टि दानिलो नेतिनि कलिपिकोनि त्रागिन पित्तकासमुलु तोलगिचनुను. तामरगिञ्जल चूर्णमुलो तेनेनु कलिपि सेविञ्चिन पित्तसम्बन्धमुलगु दग्गुलनु पाఱन्दोलुनु. कफसम्बन्ध मगु दग्गुल रोगि बलमुगलवाँडै युण्डिनयेडल मोदल नतनिकि वमनमुनु चेयिम्पवलयुनु. कोञ्चेमु चेदुगानु वेच्चगानु नुन्नट्टि अन्नमुनु कफनाशकमुलगु वस्तुवुलनु भुजिम्प नीयवलयुनु. पिप्पळ्लु, क्षारपदार्थमुलु, उलवलु, दुम्पलु वीटितो चेयँबडिन गञ्जितोँगानि, कटुवुगल रसमुलतोँगानि तेलिकयगु नन्नमुलनु भुजिम्पवलयुनु.
पैश्लोकमु तरुवात कोन्निटिलो नी क्रिन्दि श्लोकमु गलदु. श्लो. पञ्चकोलैश्शृतन्तीक्षीरं कफघ्नंलघुशस्यते, श्वासकासज्वरहरं बलवर्णाग्नि वर्धनम्.
पुष्करमूलादि क्वाथमु.
श्लो. पौष्करं कट्फलं भार्गी विश्वपिप्पलसाधितम्. 18 पिबेत्क्वाथं कफोद्रेके कासे श्वासे च हृद्ग्रहे, स्वरसं शृङ्गबेरस्य माक्षीकेण समन्वितम् 19. पाययेच्छ्वासकासघ्नं प्रतिश्यायकफापहम्, मुद्गामलाभ्यां यवदाडिमाभ्यां कर्कन्धुना मूलकशुण्ठकेन. 20. शठिकणाभ्यां च कुलत्थकेन यूषो नवाङ्गः कफरोगहन्ता, पार्श्वशूले ज्वरे श्वासे कासे श्लेष्मसमुद्भवे. 21. पिप्पलीचूर्णसंयुक्तं दशमूलीजलं पिबेत्,
ఆంధ్ర తాత్పర్యసహితము. 171
పుష్కరమూలము, నేలగుమ్ముడు, గంటుభారంగి, శొంఠి, పిప్పళ్లు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయమును, కఫ మెక్కడుగా గలిగిన కాస(దగ్గు)రోగమునందున, శ్వాసమునందును,హృదయరోగమునందును త్రాఁగవలయును. అల్లపురసములో తేనెను వేసికొని త్రాఁగవలయును. శ్వాసకాసముల నిది యణంచును. పీనసదగ్గులను పోఁగొట్టును. పెసలు, ఉసిరిక, యవ, దానిమ్మపిందెలు, రేగు, కురువేరు, శొంఠి, కచ్చూరము, పిప్పళ్లు, మఱియును ఉలవలు వీటితోడఁ జాంగలయూషమును గంజి సిద్ధము చేయఁబడును. ఇయ్యది కఫరోగముల నణంచి వైచును. పార్శ్వశూలల విషయములోను, జ్వరము శ్వాసము కాసము శ్లేష్మమువలన గలుగుదగ్గులు వీటివిషయములలో, పిప్పళ్లచూర్ణమును కలిపికొని దశమూలముల కషాయమును త్రాఁగవలయును.
కట్ఫలాదిక్వాథః.
శ్లో. కట్ఫలం కత్త్ర్యణం భార్జీ ముస్తం ధాన్యం వచా భయా.
22. శృంగీ పర్పటకం శుంఠీ సురాహ్వా చ జలే శృతమ్, మధుహిం
గుయుతం పేయం కాసే వాత కఫాత్మకే. 23. కంఠరో గే క్షయేశూలే
శ్వాసహిక్కాజ్వరేషు చ.
నేలగుమ్ముడు, కామంచి, గంటుభారంగి, తుంగముస్తలు, ధనియములు,వస, కరక్కాయలు, కర్కాటక శృంగి, పర్పాటకము, శొంఠి, దేవదారు వీటిని కషాయము పెట్టి అందు తేనెయును, ఇంగువయును చేర్చి త్రాగవలయును. ఇయ్యది వాతమువలన, కఫమువలనఁ గలిగెడి దగ్గులయందును, కంఠరోగములయందును, క్షయయందును, శూలలయందును, శ్వాసము, వెక్కిళ్లు, జ్వరము వీనియందును హితకరము అగుచున్నది.
వాకుడు మొదలగు కషాయములు.
శ్లో. కంటకారికృతఃక్వాథః సకృష్ణః సర్వకాసహా. 24. విభీతకం
ఘృతాభ్యక్తం గోశకృత్పరివేష్టితమ్, స్విన్న మగ్నౌ హరే త్కా
సం ధ్రువ మాస్యవిధారితమ్. 25. వాసక స్వరసః పేయోమధుయుక్తో హి
తాశినా, పిత్తశ్లేష్మకృతే కాసే రక్తపిత్తే విశేషతః. 26. పిప్పలీ మధుకం
ద్రాక్షా లాక్షా శృంగీ శతావరీ, ద్విగుణా చ తుగాక్షీరీ సితా
సర్వై శ్చతుర్గుణా. 27. తం లిహ్యా న్మధుసర్పిర్భ్యాం క్షతకాసనివృత్తయే,
పిప్పలీ పద్మకం లాక్షా సంపక్వం బృహతీఫలమ్. 28. ఘృతక్షౌద్రయుతో
లేహః కాసశ్వాసనిబర్హణః, హరీతకీనాగరముస్తచూర్ణం గుడేన
172 చక్రదత్త—౧౧. కాసరోగాధికారము.
తుల్యం గుటికా విధేయా. 29. నివారయ త్యాస్యవిధారి తేయం శ్వాసంప్రవృద్ధం ప్రబలం చ కాసమ్.
నేలములక కషాయములో పిప్పళ్లను చేర్చి కొని త్రాగిన నన్నివిధము లగు దగ్గులు తగ్గిపోవును, తాడికాయలను నేతిలో నూరనైచి, ఆవుపేడలో పొదివి కుమ్మములో నుదుకఁ బెట్టి పుక్కిట నుంచికొనుచుండినయెడల దగ్గును హరింపఁజేయును. అడ్డసర పుటాకురసములో తేనెను కలిపికొని పిత్తశ్లేష్మములచేత నగు దగ్గులు కలిగినపుడు త్రాగవలయును. విశేషముగా నిద్రానిని రక్తిపిత్తముల చేత బుట్టెడి దగ్గులయందు సేవింపవలయును. పిప్పళ్లు, యష్టిమధుకము ద్రాక్ష లక్కపుడకలు కర్కాటకశృంగి పిల్లిపిచ్చర వీనిని సమానభాగములుగాను, తవక్షీరి నన్నిటికంటె ద్విగుణముగాను, చక్కెర నన్నిటికంటె చతుర్గుణముగాను తీసికొని వీని నన్నిటిని నేతిలోను తేనెలోను కలిపి భక్షించినయెడల క్షయసంబంధము లగు దగ్గులు నివారించును. కరకకాయలు, శొంఠి, తుంగముస్తలు వీటిచూర్ణములో సమానముగా బెల్లమును కలిపి మాత్రలను కట్టి సేవింపవలయును. ఈమాత్రలు పుక్కిటిలో నుంచికొనినయెడల ప్రబలిన శ్వాసమును దగ్గులను పోఁగొట్టును.
మరీచాద్యచూర్ణము.
శ్లో. కర్షః కర్షార్థ మథో పలం పలద్వయ మథార్థకర్ష శ్చ, మరీచస్య పిప్పలీనాం దాడిమగుడయవశూకానామ్. 30.
సర్వైరథైరసాధ్యాయే కాసా స్సర్వవైద్యవివర్జితాః, అపి పూయం ఛర్దయతాం తేషా మిద మౌషధం పథ్యమ్. 31.
మిరియములు ఒకకర్షము, పిప్పళ్లు అర్ధకర్షము, దానిమ్మగింజలు 1 పలము, బెల్లము రెండుపలములు, యవక్షారము అర్ధకర్షము వీటి నన్నిటిని చేర్చి చూర్ణమును చేయవలయును. అన్నివిధములగు మందులచేతను కుదురనివియును వైద్యులెల్లరును కుదుర్పజాలక నిరాశ జేసికొని వదిలిపెట్టఁబడినవియును, దుర్గంధము వచ్చునట్టివియు నగు దగ్గుల కియ్యది అమూల్యమును పథ్యము నగు నౌషధము.
సమశర్కర చూర్ణము.
శ్లో. లవంగజాతీఫలపిప్పలీనాం భాగా స్స్రికల్పా వృక్ష యుతానమీషాం, పలార్ధ మేకం మరీచస్య దద్యా త్పలాని చత్వారి మహౌషధస్య. 32.
సితాసమం చూర్ణ మిదం ప్రసహ్య రోగా నిమూ నాశు
ఆంధ్రతాత్పర్యసహితము. 173
బలా న్నిహన్యాత్. కాసజ్వరారోచక మేహగుల్మ శ్వాసాగ్నిమాంద్య గ్రహణీప్రదోషాన్. 33.
లవంగములు జాజికాయ పిప్పళ్లు ఇవి యన్నియును అష్టప్రమాణమును మిరియములు అరపలమును, శొంఠి నాలుగుపలములను చేర్చి వీటిని చూర్ణము చేయవలసినది. ఆచూర్ణముతో సమానముగా చక్కెరను చేర్చవలయును. ఇయ్యది మిగుల బలవంతము లగు దగ్గులను జ్వరమును అరోచకములను మేహమును గుల్మరోగములను శ్వాసములను అగ్నిమాంద్యమును గ్రహణులను నశింపజేయును.
హరీతకీమోదకము మున్నగునవి.
శ్లో. హరీతకీ కణా శుంఠీ మరిచం గుడసంయుతమ్, కాసఘ్నో మోదకః ప్రోక్తః తృష్ణారోచక నాశనః. 34.
తాలీసవహ్ని దీప్యక చవికా శుంఠ్యమ్లవేతస వ్యోషైః, తుల్యై స్త్రిసుగంధియుత్తై ర్గుడేన గుటికా ప్రకర్తవ్యా. 35.
కాసశ్వాసారోచక పీనసహృత్కంఠవాజ్నిరోధేషు, గ్రహణీగుదోర్ధ్వ వేషు గుటికా వ్యోషాంతికా నామ. 36.
మనశ్శిలాలతా మధూక మాంసీముస్తైర్గుడైః పిబేత్, ధూమం త్ర్యహం చ తస్యాను సగుడం చ పయః పిబేత్. 37.
ఏష కాసా న్పృథగ్వంద్వా సర్వదోష సముద్భవాన్, శ్లథైరపి ప్రయోగారాం సాధయే దప్రసాధితాన్. 38.
మనశ్శిలాలి ప్రదలం బదర్యా ఘర్మశోషితమ్, సక్షీరం ధూమపానాత్తు మహత్కాసనిబర్హణమ్. 39.
అర్కచ్ఛల్లీ లే తుల్యై తతోఽర్ధేన కటుత్రికమ్, చూర్ణితం వహ్నినిక్షిప్తం పిబేద్ధూమం తు యోగవిత్. 40.
భక్షయే దథ తాంబూలాం పిబే దుగ్ధ మనూంబు వా, కాసాః పంచవిధా యాంతి శాంతి మాశు న సంశయః. 41.
కరక కాయలు పిప్పళ్లు శొంఠి మిరియములు బెల్లము వీనిని చూర్ణము చేసి, కుడుములుగా జేసి భక్షించినయెడల దప్పిక, అరోచకములను నశింపఁజేయును. తాడిశపత్రి చిత్రమూలము ఓమము చెవ్యము శొంఠి ఆమ్లవేతసము మిరియములు పిప్పళ్లు లవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీని నన్నిటిని సమానముగా చేర్చి బెల్లముతో మాత్రలు కట్టి సేవింపవలయును. ఈమాత్రలను వ్యోషాంతికము లని యందురు. ఈమాత్రలు దగ్గు శ్వాసను అరోచకము పీనస హృద్రోగము మాటపడిపోవుట గ్రహణి ఈరోగములయందు మిక్కిలి హితమును చేయును. ఈమాత్రలలో లవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీని నన్నిటిని నాల్గుమాషములయొత్తు కలపవలయును. మణిశిల హరిదళము య
१७४ चक्रदत्त—११. कासरोगाधिकारमु.
[य]ष्टीमधुकमु जटामांसि, तुंगमुस्तलु गारकायलु वीनिनि चूर्णमु चेसि, चुट्टगा काल्चि, ईपोगनु मूఁडुदिनमुलु त्रागुचु आपैनि पालनु त्रागुचुंडिनयेडल मिक्किलि भयंकरमु लगु दग्गुलूकूडनु दूरमुगा तोलఁगिपोवुनु. जिल्लेडुआकुलु मणिशिल समानभागमुलुगा चेर्चिकौनि, शोंठि मिरियमुलु पिप्पळ्लु सगभागमुनु चेर्चि चूर्णमुचेसि चुट्टचुट्टि काल्चि पोगनु योगवेत्त यगुवाडु त्रागवलयुनु. तरुवात तांबूलमुनु वेसिकोनवलयुनु. लेकुन्न पालनु गानि नीळ्लनैननु गानि त्रागवलयुनु. इंदुचेत अयिदुतेऱंगुलगु दग्गुलुनु निस्संशयमुगा तोलఁगि पोवुनु.
— ॐ दशमूलघृतमु. ॐ —
श्लो. मरिचशिलार्कक्षीरै र्वार्ताकीं त्वच माशु भावितां शुष्काम्, कृत्वा विधिना धूमं पिबतः कासा श्शमं यांति. ४२. दशमूलीकषायेण भार्गीकल्कं पचे द्घृतम्, दक्षतित्तिरि निर्यूहे तत्परं वातकासनुत्. ४३.
मिरियमुलु मणिशिल जिल्लेडुपालु वीटितोड मूलक चेट्टुतोक्कनु नानवैचि तरुवात दानिनि एंडिंचि यथाविधिगा पोगनु त्रागॆडिवानिकिच्चिन दग्गु लन्नियुनु तग्गिपोवुनु. दशमूलमुल कषायमुतो गंटुभारंगि कल्कमुनु कलिपि दानियंदु नेतिनि चेर्चि वंडवलयुनु, लेक कोडि तित्तिरिपक्षुल निर्यूहमुनंदु घृतमुनु गानि पक्वमु चेयवलयुनु. इय्यदि सेविंचिनचो विशेषमुगा वातसंबंधमु लगु दग्गुलनु पाऱఁद्रोलुनु.
— ॐ दशमूलाद्यघृतमु. ॐ —
श्लो. दशमूलाढके प्रस्थं घृतस्याक्षसमैः पचेत्, पुष्कराह्व शठी बिल्व सुरा सव्योष हिंगुभिः. ४४. पेयानुपानं तद्देयं कासे वातकफाधिके, श्वासरोगेषु सर्वेषु कफवातात्मकेषु च. ४५.
अरुवदिनाल्गुपलमुल दशमूलपु कषायमुनंदु पुष्करमूलमु कच्चूरमुलु बिल्वपु वेरु नल्लतॆगड शोंठि मिरियमुलु इंगुव वीनि नन्निटिनि ओक्कोक्क अक्षमु चोप्पुननु तीसिकोनि वानियंदु पदियारु पळमुल नेतिनि पोसि पक्वमु चेयवलयुनु. दीनिनि पेयानुपानमुगा वातमु कफमु मोदलगुवानिवलनఁ बुट्टिन
ఆంధ్ర తాత్పర్యసహితము. 175
దగ్గులయందును శ్వాసరోగములయందును కఫమువాతము వీటివలన కలిగినవాటియందును ఈయవలయును.
దశమూలషట్పలఘృతము
श्लो. दशमूलीचतुःप्रस्थे रसे प्रस्थोन्मितं हविः, सक्षारैः पञ्चकोलैस्तु कल्कैः साधु साधितम् ॥ ४६ ॥
कासहृत्पार्श्वशूलघ्नं हिक्काश्वासनिबर्हणम्, कल्कं षट्पल मेवात्र ग्राहयन्ति भिषग्वराः ॥ ४७ ॥
తాత్పర్యము: నాలుగు ప్రస్థముల దశమూలకషాయములో పదియారు పలముల నేతిని యవక్షారము పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి వీటియొక్క కల్కమును కలిపి నేతిని సిద్ధము చేయవలయును. ఇయ్యది దగ్గు హృదయశూలము పార్శ్వపునొప్పి వెక్కిళ్లు శ్వాసము వీటిని నశింపఁజేయును. ఇచ్చట నుత్తమవైద్యులు 6 పలముల కల్కమునే గ్రహింపవలయు నందురు.
కంటకారీఘృతము
श्लो. कण्टकारीगुडूचीभ्यां पृथक् त्रिंशत्पलाद्रसे, प्रस्थस्सिद्धो घृताद्वातकासनुद्वह्निदीपनः ॥ ४८ ॥
घृतं रास्नाबलाव्यूष श्वदंष्ट्राकल्कपाचितम्, कण्टकारेद्रसे सर्पिः पञ्चकासनिषूदनम् ॥ ४९ ॥
తాత్పర్యము: వాకుడు తిప్పతీగ వీటితోచేసిన ముప్పదిపలముల కషాయముతో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది వాతసంబంధము లగు దగ్గులను పోఁగొట్టును. అగ్ని నుద్దీపింపఁజేయును. సన్నరాస్న ముత్తువపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు పల్లేరు వీటికల్కములోను వాకుడరసములోను పక్వముచేయఁబడిన ఘృతము అయిదుతెఱఁగులగు దగ్గులను నశింపఁజేయును.
బృహత్కంటకారీ ఘృతము
श्लो. सपत्रमूलशाखायाः कण्टकार्या रसाढके, घृतप्रस्थं बलाव्यूष विडङ्गशठिचित्रकैः ॥ ५० ॥
सौवर्चल यवक्षार बिल्वामलक पुष्करैः, वृश्चीर बृहती पथ्या यवानीदाडिमर्द्धिभिः ॥ ५१ ॥
द्राक्षा पुनर्नवा चव्य धन्वयासाम्लवेतसैः, शृङ्गीतामलकी भार्गी रास्ना गोक्षुरकैः पचेत् ॥ ५२ ॥
कल्कैस्तु सर्वका-
176 చక్రదత్త—౧౧. కాసరోగాధికారము.
శేషు హిక్కా శ్వాసే చ శస్యతే, కంటకారీఘృతం సిద్ధం కఫవ్యాధివి నాశనమ్. 53.
ఆకుల వేళ్లు కొమ్ములతో గూడిన నేలములక రసమును ఆఢకప్రమాణము సిద్ధము చేసి దానియందు పదియారుపలముల నేతినితీసికొని, ముత్తువుపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు కచ్చూరము చిత్రమూలము సౌవర్చలవణము యవక్షారము బిల్వపువేఱు ఉసిరిక పుష్కరమూలము పృశ్నిపర్ణి ములక కరకకాయ ఓమము దానిమ్మ వృద్ధి ద్రాక్ష శొంఠి చెవ్యము యవాసను గజ్జేరు వ్యాఘ్రనఖమను ద్రవ్యము నేలతాడి గంటుభారంగి సన్నరాస్న పల్లేరు వీటితో కల్కమునుచేసి ఆకల్కముతో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది కంటకారీఘృతము. ఇది అన్నివిధము లగు దగ్గులను వెక్కిళ్లను శ్వాసమును పోఁగొట్టుటయం దత్యుత్తమము. మఱియును కఫరోగములను నశింపఁజేయును. ఇయ్యదియే బృహత్కంటకారీఘృతమనియు ననంబడును.
రాస్నాద్యఘృతము.
శ్లో. ద్రోణేఽపాం సాధయే ద్రాస్నాం దశమూలీం శతావరీమ్,
ఫలికాం మానికాంశ్చాం స్త్రీన్ కులుత్థాన్ బదరాన్ యవాన్. 54.
తులార్థం చాజమాంసస్య తదర్ధేషేణ తేన చ, ఘృతాఢకం సమ
క్షీరం జీవనీయైః పలోని తైః. 55.
సిద్ధం తద్దశభిః కల్కైః నస్యపానానువాసనైః,
సమీక్ష్య వాతరోగీషు యథావస్థం ప్రయోజయేత్. 56.
పంచకాసాన్ క్షయం శ్వాసం పార్శ్వశూల మరోచకమ్,
సర్వాంగై కాంగరోగం శ్చ ప్లీహోర్ధ్వానిలం జయేత్. 57.
జీవకర్షభకౌ మేదే కాకోల్యా శూర్పపర్ణికే,
జీవంతీ మధుక శ్చైవ దశకో జీవకో గణః. 58.
ద్రోణపరిమితమగు నుదకములో సన్న రాస్నను దశమూలమును పిల్లిపిచ్చరను ఒక్కొక్కపలము చొప్పునను, ఉలవలు ఱేగుపండ్లు యవలును మూడు మూడు మానికలు చొప్పుననున్ను, మేకమాంసము 50 పలములు, జీవనీయగణములో చెప్పిన యౌషధములు ఒక్కొక్క పలమును, నేయి 64 పలములును దీని నన్నిటిని చేర్చి నేతిని పక్వముచేయవలయును. దీనితో వాతరోగముల విషయము లో నస్యము పానము అనువాసనలను తగుమాత్రముగా ప్రయోగింపవలయును. ఇయ్యది అయిదు తెఱంగులగు దగ్గులను క్షయ శ్వాసము పార్శ్వశూల అరోచకము సర్వాంగరోగము ఏకాంగరోగము, ప్లీహ ఊర్ధ్వ వాతము వీటిని జయించును. జీవకము ఋషభకము మేద మహామైద